Begin typing your search above and press return to search.

చైతూ లైఫ్ ను ముందుకు నడిపించినదెవరో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Dec 2021 5:02 PM IST
చైతూ లైఫ్ ను ముందుకు నడిపించినదెవరో తెలుసా?
X
ఒకప్పుడు సినిమా షూటింగులు స్టూడియోల్లోనే జరిగేవి. ఒకవేళ అవుట్ డోర్ లో చేసినా, ఆర్టిస్టులను దూరం నుంచి చూడటమే తప్ప, ఫోటోలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో కెమెరాలు ఎవరి దగ్గరా అంతలా ఉండేవి కాదు. ఒక వేళ అదృష్టం బాగుండి ఫొటో దిగినా అది అందరికీ చూపించుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇక ఇప్పుడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రపంచమే ఒక కుగ్రామం మాదిరిగా మారిపోయింది. సెలబ్రిటీలను కలుసుకునే అవకాశలు పెరిగిపోయాయి.

మనం ఎంతగానో అభిమానించేవారిని కలుసుకోగానే చక్కగా ఒక సెల్ఫీ తీసేసుకోవచ్చు. అక్కడే ఉండి ఆ క్షణంలోనే ఆ మూమెంట్ ను వేలమందితో పంచుకోవచ్చు. అందువల్లనే సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడానికి అందరూ కూడా ఎగబడుతూ ఉంటారు. అయితే ఆ సెలబ్రిటీలు కూడా తమ అభిరుచికి తగినట్టుగా .. తమ ఇష్టానికి తగినట్టుగా మరి కొందరికి అభిమానులుగా ఉండటం సహజం. వాళ్లని కలిసినప్పుడు వీరు కూడా సెల్ఫీ కొట్టేసి తమ ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ నాగచైతన్య కూడా అదే పని చేశాడు.

చైతూ తన ఫేవరేట్ డీజే కంపోజర్ బెన్ బొహ్మర్ ను కలుసుకున్నాడు. వెంటనే ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుని షేర్ చేస్తూ, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. "నిజంగా ఇది ఫ్యాన్ బాయ్ మూమెంట్. తన సంగీతంతో నా జీవితాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేసిన వ్యక్తిని కలుసుకున్నాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితాన్ని ముందుకి నడిపిన ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. చైతూ తీసుకున్న ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక చైతూ విషయానికి వస్తే, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన చేసిన 'థ్యాంక్యూ' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. మరో వైపున చాలా వేగంగా ఆయన 'బంగార్రాజు' షూటింగును కూడా పూర్తి చేశాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతూ జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఈ సినిమాలో అసలు కథానాయకుడు నాగార్జున అయితే, చైతూ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ చైతూ పాత్రనే మెయిన్ అనేలా నాగార్జున ఈ కథను డిజైన్ చేయించడం విశేషం.