Begin typing your search above and press return to search.

#రెడ్ .. ఈ 15ఏళ్ల‌లో రాపోకి పోటీ ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   17 Jan 2021 3:52 AM GMT
#రెడ్ .. ఈ 15ఏళ్ల‌లో రాపోకి పోటీ ఎవ‌రో తెలుసా?
X
`ఇస్మార్ట్ శంక‌ర్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌కుమించిన విజ‌యం సాధించాల‌ని ఎంతో క‌సిగా ప‌ని చేశాడు రాపో అలియాస్ రామ్ పోతినేని. అత‌డు న‌టించిన తాజా చిత్రం రెడ్ థియేట‌ర్ల‌లోకి రిలీజై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. ఇదే విష‌యాన్ని రెడ్ సక్సెస్ వేడుకల్లో అంగీకరించారు రామ్. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలతో ప్రారంభమైంది. కానీ థియేటర్లలోని స్పందన.. కలెక్షన్ల ప‌రంగా చాలా సంతోషంగా ఉన్నాన‌ని రామ్ హింట్ ఇచ్చాడు.

రెడ్ మిశ్రమ సమీక్షలతో ప్రారంభమైనా సాయంత్రం షోతో ఊపందుకుంద‌ని.. స‌మీక్ష‌ల‌కు పూర్తి భిన్నమైన ప‌రిస్థితి సాయంత్రానికి క‌నిపించ‌డం సస్పెన్స్ థ్రిల్లర్ ‌కు అతిపెద్ద ట్విస్ట్ అని అన్నారు. 15ఏళ్ల క్రితం రిలీజైన తొలి ప‌రిచ‌య చిత్రం `దేవ‌దాస్`(సంక్రాంతి రిలీజ్) గురించి ప్ర‌స్థావించారు రామ్.

ఇండ‌స్ట్రీలో తన కాంపిటీట‌ర్ ప్ర‌స్థావ‌న తెచ్చారు రామ్. ఇప్పటివరకు ఏనాడూ త‌న కాంపిటీట‌ర్ గురించి తాను ఆలోచించ‌లేద‌ని..ఇన్నాళ్టికి పోటీని కనుగొన్నానని.. అది తన అభిమానులు ప్రేక్షకులు మాత్ర‌మేన‌ని రామ్ అన్నారు. ఇక‌పై ప్ర‌తిదీ డిఫ‌రెంట్ గా ఉంటుంది. త‌న‌పై ప్రేక్షకులు చూపిన ప్రేమతో పోటీని తెర‌పై చూస్తార‌ని రామ్ అన్నారు. ఈ మూవీ త‌ర్వాత రాపో క్యూలో ప‌లువురు ద‌ర్శ‌కులు ఉన్నారు. పూరితో ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్లో న‌టించేందుకు రామ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.