Begin typing your search above and press return to search.

నేల‌ టికెట్ కొని సినిమాలు చూసిన స్టార్ డైరెక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:00 AM IST
నేల‌ టికెట్ కొని సినిమాలు చూసిన స్టార్ డైరెక్ట‌ర్‌
X
స్టార్ డైరెక్ట‌ర్ నేల టిక్కెట్ కొని సినిమాలు చూశాడంటే న‌మ్ముతారా? .. ఆయ‌న తండ్రి రోజు కూలీ. అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే ఇల్లుగ‌డ‌వాలి. అలా వ‌చ్చిన డ‌బ్బుతోనే స్టార్ డైరెక్ట‌ర్ నేల టిక్కెట్ కొని సినిమాలు చేశాడ‌ట‌. ఇది ఓ స్టార్ డైరెక్ట‌ర్ తెర వెనుక క‌థ‌.. ఎవ‌రికీ తెలియ‌ని క‌థ‌. ఇంత‌కీ ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? .. ఆయ‌న ఇప్పుడు ఎలా వున్నారు? తెలుసా.. ఆయ‌నే త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్‌. మురుగ‌దాస్‌. కృషి వుంటే మ‌నుషులు రుషుల‌వుతారంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మురుగ‌దాస్ జీవితం.

వెండితెర‌పై ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ని అందించారాయ‌న‌. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రాలు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు సాక్ష్యంగా నిలిచాయి. గ‌జిని, ర‌మ‌ణ, సెవెంత్ సెన్స్ వంటి చిత్రాలు ద‌ర్శ‌కుడిగా మురుగాదాస్ కున్న ప్ర‌త్యేక‌త‌ని చాటాయి. అయితే స్టార్ డైరెక్ట‌ర్ కావ‌డానికి ఆయ‌న ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ట‌. ఆయ‌న‌తో స్టార్ హీరోలు సైతం ఒక మూవీ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి స్టార్ డైరెక్ట‌ర్ తండ్రి పేరు అరుణాచ‌లం.

ఆయ‌నో కూలీ. అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే ఇల్లు గ‌డిచేద‌ట‌. కానీ మురుగ‌దాస్ కు చిన్న‌త‌నం నుంచే సినిమా అంటే విప‌రీత‌మైన ఇష్టం వుండేవ‌ట‌. ఆ ఇష్టం కార‌ణంగానే సినిమాకు సంబంధించిన ఏ చిన్న పేప‌ర్ ల‌భించినా విడిచి పెట్ట‌కుండా చ‌దివేవార‌ట‌. సినిమా అంటే ఇష్టం వుండ‌టంతో త‌న‌కు ల‌భించిన డ‌బ్బుల‌తోనే నేల ట‌క్కెట్ కొని సినిమాలు చూసేవార‌ట‌. అలా సినిమాలు చూస్తూనే డిగ్రీ పూర్తి చేసి సినిమాపై ఆస‌క్తితో ద‌ర్శ‌కుడు కావాల‌ని చెన్నైకి వ‌చ్చేశార‌ట‌.

చెన్నై వెళ్లిన స‌మ‌యంలో మురుగ‌దాస్ వ‌ద్ద డ‌బ్బులు లేవంట‌. అత‌నికి ఇంటి నుంచి కేవ‌లం 500లు పంపించేవార‌ట‌. వాటితోనే స‌రిపెట్టుకుని ఒక పూట మాత్ర‌మే భోజ‌నం చేసి మిగ‌తా వేళ‌లో పస్తులు వున్నార‌ట‌. ఇంటి ద‌గ్గ‌రి నుంచి వ‌చ్చే డ‌బ్బులు కూడా రాక‌పోవ‌డంతో ఆరు నెల‌లు ఇంటి అద్దె బాకీ ప‌డ్డార‌ట‌. చివ‌రికి డ‌బ్బుల కోసం స్నేహితుడి వ‌ల్ల బ‌ట్లు ఉత‌క‌డం చేశార‌ట‌. ఇందు మురుగాదాస్ కు ఓ ప్యాంట్ కు 1రూ. ఇచ్చేవార‌ట‌.

ఇది చూసిన ఇంటి ఓన‌ర్ చ‌లించిపోయి ఇక‌పై అలాంటి పిన చేయ‌క‌ని, మ‌రో ఆరు నెల‌లు ఇంటి అద్దె చెల్లించ‌క‌పోయినా ఫ‌ర‌వాలేద‌ని బ్రతిమాలార‌ట‌. ఆయ‌నే స్వ‌యంగా `అమృతం` అనే టైట‌ర్ వ‌ద్ద పనిలో చేర్పించార‌ట‌. అక్క‌డి నుంచే మురుగ‌దాస్ సినీ జీవితం మ‌లుపు తిరిగింది. ఎన్నో సినిమాల‌కు ఆయ‌న వ‌ద్ద ప‌నిచేసిన మురుగ‌దాస్ కు ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యాలు పెరిగాయ‌ట‌.

మురుగాస్ ఇక త‌న‌కు మంచి రోజులొచ్చాయి అని భావిస్తున్న స‌మ‌యంలోనే తండ్రి చ‌నిపోయాడ‌న్న చేదు వార్త విన్నార‌ట‌. ద‌ర్శ‌కుడిగా చూడాల‌న్న త‌న తండ్రి కోరిక నెర‌వేర‌క ముందే ఆయ‌న చ‌నిపోవ‌డంతో ఆ దుఃఖాన్ని దిగ‌మింగార‌ట మురుగ‌దాస్‌. ఆ త‌రువాత ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాలు రావ‌డం మొద‌లైంది. అలా ద‌ర్శ‌కుడు ఎస్‌.జె. సూర్య వ‌ద్ద వాలి, ఖుషీ చిత్రాల‌కు ప‌ని చేశారు.

`వాలి` సినిమాకు ప‌ని చేయ‌డంతో హీరో అజిత్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అదే ఆయ‌న‌కు ద‌ర్శ‌కుడిగా తొలి అవ‌కాశాన్ని అందించింది. అజిత్ తో చేసిన `దీనా` చిత్రంతో ఏ.ఆర్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఈ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో మురుగ‌దాస్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆ త‌రువాత విజ‌య్ కాంత్ తో చేసిన `ర‌మ‌ణ‌`( తెలుగులో `ఠాగూర్ గా రీమేక్ అయింది), సూర్య‌తో చేసిన గ‌జిని వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు గా నిలవ‌డంతో మురుగ‌దాస్ ద‌శ మారిపోయింది.

`గ‌జిని` చిత్రాన్ని హిందీలో అమీర్ ఖాన్ తో రీమేక్ చేస్తే అది దేశ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా చూసిన ముఖేష్ అంబానీ .. మురుగ‌దాస్ ని స్వ‌యంగా ఇంటికి పిలిచి ఆయ‌న‌తో సినిమా చూసి క‌లిసి డిన్న‌ర్ చేశార‌ట‌. ఇదీ మురుగ‌దాస్ ప్ర‌తిభ‌. విజ‌య్‌ తో తుపాకి, క‌త్తి, ర‌జ‌నీకాంత్ తో `ద‌ర్బార్‌` వంటి చిత్రాల‌ని అందించారు. ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరో తో సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నారు.