Begin typing your search above and press return to search.

F2 హీరోలు సోలో గా సత్తా చాటుతారా?

By:  Tupaki Desk   |   24 Dec 2019 1:30 AM GMT
F2 హీరోలు సోలో గా సత్తా చాటుతారా?
X
ఈ ఏడాది ఆరంభం లో విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టిస్టారర్ 'F2' సంక్రాంతి విజేతగా నిలవడమే కాకుండా అటు వెంకీ కెరీర్లోనూ.. ఇటు వరుణ్ తేజ్ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు వెంకీ - వరుణ్ కాంబినేషన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే వెంకటేష్.. వరుణ్ లు సోలో హీరోగా నటిస్తే ఈ రేంజ్ హిట్ సాధించగలరా అనేది నిజంగా ఆలోచించాల్సిన అంశం.

'F2' తర్వాత వరుణ్ 'గద్దలకొండ గణేష్' లో నటించాడు.  అయితే సినిమా యావరేజ్ గానే సరి పెట్టుకుంది.   వెంకటేష్ విషయానికి వస్తే మేనల్లుడు నాగచైతన్య తో కలిసి 'వెంకీమామ' సినిమాలో నటించాడు. 'వెంకీమామ' బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం వెంకీకే ఇవ్వలేం. ఎందుకంటే.. ఈ సినిమాలో హైలైట్ వెంకటేష్ - నాగచైతన్య కలిసి నటించడమే. అయినా ఈ సినిమా 'F2' రేంజ్ హిట్ అయితే కాలేదు.

ఈ లెక్కన వచ్చే ఎడాదిలో రిలీజ్ కాబోయే వెంకటేష్.. వరుణ్ సోలో సినిమాల ఫలితం చూస్తేనే మనం ఈ హీరోల కు సొంత మార్కెట్ ఎంత ఉందనే విషయం తెలిసే అవకాశం ఉంది.  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ తమిళ సూపర్ హిట్ 'అసురన్' రీమేక్ లో నటిస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.  మరో వైపు వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో బాక్సింగ్ నేపథ్యం లో ఒక సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాల ఫలితాల ను బట్టి ఈ హీరోల సోలో మార్కెట్ ఎంత ఉందో అర్థం అవుతుంది.