Begin typing your search above and press return to search.

రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ పై సూపర్‌ స్టార్స్‌ స్పందించేనా?

By:  Tupaki Desk   |   30 April 2020 9:00 AM IST
రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ పై సూపర్‌ స్టార్స్‌ స్పందించేనా?
X
అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ షురూ చేసిన బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ మొదటి వారం రోజులు చాలా స్పీడ్‌ గా స్ప్రెడ్‌ అయ్యింది. సందీప్‌ వంగ నుండి ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి రియల్‌ మ్యాన్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆయన ద్వారా ఎన్టీఆర్‌.. చరణ్‌.. చిరంజీవి.. వెంకటేష్‌.. సుకుమార్‌.. కొరటాల శివ.. విజయ్‌ దేవరకొండ.. బోయపాటి.. అనీల్‌ రావిపూడి.. క్రిష్‌.. దేవిశ్రీ ప్రసాద్‌ ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ లో భాగస్వామ్యం అయ్యి తమ రియల్‌ మ్యాన్‌ వీడియోలను పోస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

వెంకటేష్‌ ఛాలెంజ్‌ చేసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇంకా చిరంజీవి ఛాలెంజ్‌ చేసిన సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ లు మాత్రం ఈ ఛాలెంజ్‌ లను యాక్సెప్ట్‌ చేయలేదు. వీరు మాత్రమే కాకుండా నాగార్జున.. బాలకృష్ణ.. మణిరత్నం.. వరుణ్‌ తేజ్‌.. కేటీఆర్‌ లు కూడా ఈ ఛాలెంజ్‌ పై స్పందించ లేదు. సూపర్‌ స్టార్స్‌ ఇద్దరు ఈ ఛాలెంజ్‌ స్వీకరిస్తే మళ్లీ సందడి మొదలయ్యే అవకాశం ఉంది. వీరిద్దరు కాస్త ఆలస్యంగా అయినా స్పందిస్తారని వారి వారి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహేష్‌ బాబు ఇలాంటి ఛాలెంజ్‌ లు.. యాక్టివిటీస్‌ లపై ఆసక్తి చూపించడు. కాని రజినీకాంత్‌ మాత్రం ఇలాంటి విషయాల్లో యాక్టివ్‌ గానే ఉంటాడు. మరి ఆయన చిరంజీవి ఛాలెంజ్‌ ను ఎందుకు స్వీకరించలేదో అర్థం కావడం లేదు. బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ లో భాగంగా మహేష్‌ బాబు వీడియో పోస్ట్‌ చేస్తే అది ఖచ్చితంగా వండర్‌ అవుతుంది. పిల్లలతో ఎంజాయ్‌ చేస్తూ ఉన్న ఫొటోలను మహేష్‌ పోస్ట్‌ చేస్తున్నాడు కాని రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ వీడియో మాత్రం పోస్ట్‌ చేయడం లేదు. దాంతో కొందరు మహేష్‌ రియల్‌ మ్యాన్‌ కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.