Begin typing your search above and press return to search.

`ఇత‌రుల‌‌ అభిమానులు` అంటూ నాని కెలికాడా?

By:  Tupaki Desk   |   28 March 2021 4:30 PM GMT
`ఇత‌రుల‌‌ అభిమానులు` అంటూ నాని కెలికాడా?
X
స్టార్ హీరోల సినిమాలు రిలీజైతే ఫ్యాన్స్ హంగామా గురించి తెలిసిందే. థియ‌ట‌ర్ల ముందు వంద‌ అడుగుల క‌టౌట్లు క‌ట్టేయ‌డం.. ఫ్లెక్సీలు పెట్టి.. విగ్ర‌హాలు ఆవిష్క‌రించి వాటికి పాలాభిషేకాలు చేసేయ‌డం వగైరా వ‌గైరా వెర్రి అభిమానం నిరంత‌రం చ‌ర్చ‌కు వస్తుంటుంది.

చూస్తుంటే నేచున‌ల్ స్టార్ నాని అలాంటి వెర్రి అభిమానుల్ని టార్గెట్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. కావాల‌నో లేక య‌థాలాపంగానో నాని ఎవ‌రిని అన్నా కానీ.. అది సాటి హీరోల‌కు త‌గిలింది! అన్న గుస‌గుస ఫిలింస‌ర్కిల్స్ లో వేడెక్కిస్తోంది.

నిన్న రాత్రి రాజమండ్రిలో `టక్ జగదీష్` పరిచయ వేడుకలో నానీ ఊహించ‌ని కామెంట్లు చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా వివాదాల్లేకుండా మాట్లాడే నాని..అనూహ్యంగా షాకింగ్ స్టేట్మెంట్ తో విరుచుకుప‌డ్డారు.

తన అభిమానులతో మాట్లాడుతూ.. అభిమానుల్ని పట్టించుకోలేదని చాలా మంది న‌న్ను తరచుగా అడుగుతారు. నా అభిమానులు నా కార్యాలయానికి వెళ్లినప్పుడు లేదా నా షూటింగ్ ప్రదేశాలను సందర్శించినప్పుడు నా కార్యక్రమాలకు హాజరైనప్పుడల్లా ఏం అనుభూతి క‌లుగుతుందో కానీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నన్ను కలవడంలో విఫలమయ్యానని .. నాతో సెల్ఫీ కావాల‌ని అడుగుతారు. ఇలాంటివి తరచుగా ట్విట్టర్ ‌లో చూస్తుంటాను. నేను కూడా వాటిని పట్టించుకోను!! అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు మీ అందరికీ చెబుతున్నాను. నేను నా అభిమానులను ఎప్పటికీ ఇలాంటి విష‌యాల్లో ప్రోత్సహించను`` అని నాని అన్నారు.

మా హీరో బాగా ఎంక‌రేజ్ చేయ‌డు అని అనుకుంటారు. మావాడు ఇంతేనా.. మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేయ‌డా? అని అనుకుంటారు నా ఫ్యాన్స్. అందుకే ఇపుడు చెబుతున్నాను.. నేను చేయ‌ను.. ఇప్పుడే కాదు ఎప్ప‌టికీ ఎంక‌రేజ్ చేయ‌ను. ఎందుకు చేయ‌నో తెలుసా.. మిగ‌తావాళ్లు కోరుకున్న‌ట్టు ఫ్యాన్స్ నుంచి నేను ఆశించేది అది కాదు. ఇతరుల్లా నా అభిమానులు అల్ల‌రి చేయ‌డం కాదు. ఇత‌రుల‌తో గొడ‌వప‌డ‌డం లేదా నా కటౌట్ ‌లకు పలాభిషేకాలు చేయ‌డం నాకు ఇష్టం లేదు. నా తల్లిదండ్రుల మాదిరిగానే నా అభిమానులందరూ నా గురించి గర్వపడాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరినీ గర్వించేలా నేను ఎప్పుడూ కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నన్ను చూసే వారు నా చేతిలో ఉన్న ఇటుకలను మాత్రమే చూడవచ్చు. కానీ ఒక రోజు వారంతా మీ హృదయంలో నాకు స్థానం ఉన్నంతవరకు బుల్డోజర్ కూడా తాకలేని దృఢ‌మైన గోడను చూస్తారు`` అంటూ ఎమోష‌న‌ల్ స్పీచ్ ఇచ్చారు నాని.

అంతా బాగానే ఉంది. అభిమానులనుద్ధేశించి మంచి మాట‌లే చెప్పారు. కానీ ``ఇత‌రులు``! అని ప్రస్థావించ‌డ‌మే ఇప్పుడు చిక్కులు తెచ్చేలా ఉంది. ఆ ఇత‌రుల‌ అభిమానులు మ‌రీ అంత మంచోళ్లు కార‌నేది నాని ఉద్ధేశ‌మా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. ఇప్ప‌టికైతే అర్థం చేసుకున్నారు కానీ.. ఇత‌ర స్టార్ల‌ను.. వారి అభిమానుల్ని కెలికితే మ‌రీ అంత మంచిది కాదేమో! అనేస్తున్నారు.