Begin typing your search above and press return to search.

కుర్ర హీరోకు ఇదే రిస్కీ బాల్

By:  Tupaki Desk   |   17 Jun 2019 4:55 AM GMT
కుర్ర హీరోకు ఇదే రిస్కీ బాల్
X
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ రావడం అందరికి జరగదు. ఆరెక్స్ 100లో భగ్న ప్రేమికుడు శివగా మెప్పించిన కార్తికేయకు హిప్పి పెద్ద షాకే ఇచ్చింది. లేని ఇమేజ్ ని ఊహించుకుని యూత్ తనంటే ఏదో వెర్రి క్రేజ్ లో ఉన్నట్టు భ్రమపడి తలాతోకా లేని ఓ అపరిపక్వ అడల్ట్ సినిమా చేసినందుకు ప్రేక్షకులు సరైన తీర్పే ఇచ్చారు. ప్రతిసారి బోల్డ్ కంటెంట్ పేరుతోనో ట్రెండ్ పేరుతోనో పైత్యాలు చూపిస్తే వర్క్ అవుట్ కావు.

ఇప్పుడు అది కార్తికేయకు తెలిసివచ్చినట్టుంది. నెల తిరక్కుండానే అతని మరో కొత్త సినిమా గుణ 369 వస్తోంది. నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వదిలారు,. ఇవాళ టీజర్ వస్తుంది. హిప్పి ఫెయిల్యూర్ ని ఒప్పుకుంటూ ఇకపై ఇంకా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటానని గుణ మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టాడు

తన సక్సెస్ గాలివాటం కాదని నిరూపించుకోవాలి అంటే గుణ 369 ఖచ్చితంగా హిట్టు కొట్టి తీరాలి. ఆపై నెల అతని మరో సినిమా గ్యాంగ్ లీడర్ కూడా రేస్ లో ఉంది కాని అది నాని మూవీ. పైగా కార్తికేయ చేసింది విలన్ రోల్. కాబట్టి పేరు వచ్చినా అది పూర్తి పాజిటివ్ గా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోలో హీరోగా మార్కెట్ బలపడాలి అంటే గుణ 369 మాములు హిట్ అయితే సరిపోదు.

వస్తున్న సమాచారం మేరకు ఇందులో కార్తికేయ మాస్ రోల్ చేసినట్టు తెలిసింది. ఇవి కాకుండా శేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా ఈ ఏడాదే వచ్చే అవకాశాలున్నాయట. నెలకో సినిమా చొప్పున స్పీడ్ బాగానే చూపిస్తున్నాడు కాని కార్తికేయ అర్జెంటుగా ఓ హిట్టు కొట్టకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పేలా లేవు