Begin typing your search above and press return to search.

నాపై అభిమానంతో మీరు నొప్పి అనుభవించొద్దు

By:  Tupaki Desk   |   11 Jan 2021 10:31 AM GMT
నాపై అభిమానంతో మీరు నొప్పి అనుభవించొద్దు
X
సినీ నటుడు సోనూ సూద్‌ ఇప్పుడు ఎంతో మంది గుండెల్లో నిలిచి పోయాడు. లాక్‌ డౌన్ సమయం నుండి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న పనులు కొన్ని వేల మంది కళ్లలో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆయన సినిమాల్లో విలన్ అయినా రియల్‌ లైఫ్ లో హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూ సూద్‌ ను చాలా మంది అభిమానిస్తున్నారు. కొందరు ఆయన పేరును తమ వాహనాలపై తమ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే కొందరు మాత్రం ఆయన పేరును ఏకంగా టాటూ వేయించుకుంటున్నారు.

ఇటీవల ఒక అభిమాని తన చేతిపై టాటూను వేయించుకున్నాడు. సోనూ సూద్‌ పేరును టాటూ వేయించుకున్న ఆ అభిమాని మా గుండె గుడిలో కొలువున్నది నువ్వేలే అంటూ సోనూ సూద్‌ ను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌ కు సోనూసూద్‌ స్పందించాడు. బ్రదర్‌ మీరు నన్ను అభిమానిస్తున్న విషయం నాకు తెలుసు. ఇలా మీరు టాటూలు వేయించుకుని మిమ్ములను మీరు బాధకు గురి చేసుకోవద్దు. అలా చేయడం వల్ల నేను బాధపడుతాను అంటూ నమస్కారం ఈమోజీని షేర్‌ చేశాడు.