Begin typing your search above and press return to search.

బాహుబలితో పోలిస్తే చిక్కులే

By:  Tupaki Desk   |   15 Aug 2019 5:19 AM GMT
బాహుబలితో పోలిస్తే చిక్కులే
X
మేకింగ్ వీడియో వచ్చాక సైరా మీద అంచనాలు పెరగడం ప్రారంభమయ్యింది. చిరంజీవి లుక్ మీద కొంతమేర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ అసలైన గెటప్ ని సరిగా చూపించలేదని టీజర్ వచ్చాక అందరికి క్లారిటీ వస్తుందని యూనిట్ చెబుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటికే ఇది బాహుబలిని బీట్ చేసే మూవీగా ఓ రేంజ్ లో హైప్ చేస్తూ వైరల్ చేసే పనిలో ఉన్నారు.

నిజానికి బాహుబలితో ఎంత ఎక్కువ పోలిక తెస్తే సైరాకు అంత చిక్కులు తప్పవు. కారణాలు ఉన్నాయి. బాహుబలి పూర్తి కాల్పానిక కథ. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టు అనుష్క క్యాలిబర్ కు సరిపోయేలా తమన్నాను వాడుకునేలా ఎలా కావాలంటే అలా అనుకూలంగా మార్చుకునే వెసులుబాటు అందులో ఉంది. అందుకే ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయ్యాక బెటర్ మెంట్ కోసం ఇంకొన్ని మార్పులు చేసానని రాజమౌళి ఒప్పుకున్నాడు

కాని సైరా నరసింహారెడ్డి కేసు వేరు. ఇది చరిత్రలో దొరికిన ఆధారాలతో అల్లిన నిజమైన కథ. నాటకీయత కోసం కొన్ని అంశాలను జోడించి ఉండొచ్చు కాని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అందుకే సైరాలో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది. బాహుబలి ఫాంటసీ కథ కావడం వల్ల ఎఫెక్ట్స్ పరంగానూ హెల్ప్ అయ్యింది. సైరాను అందుకే దానితో పోల్చకండని దర్శకుడు సురేందర్ రెడ్డి నొక్కి చెప్పడానికి కారణం ఇదే. అక్టోబర్ 2 విడుదల కానున్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల గ్రాండ్ స్కేల్ మీద జరిపేందుకు రామ్ చరణ్ పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు.