Begin typing your search above and press return to search.

ట్రైలర్: అట్లుంటది మన 'డీజే టిల్లు'తోని..!

By:  Tupaki Desk   |   2 Feb 2022 10:41 AM GMT
ట్రైలర్: అట్లుంటది మన డీజే టిల్లుతోని..!
X
టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ - యంగ్ బ్యూటీ నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''డీజే టిల్లు''. 'అట్లుంటది మనతోని' అనేది దీనికి ట్యాగ్ లైన్. యూత్ ఫుల్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. యూత్‌ ని ఆకట్టుకునే టీజర్‌ మరియు పాటలు ఈ సినిమాపై మంచి బజ్‌ ని క్రియట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్ తాజాగా లాంచ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది.

'నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ లాంచ్ అవుతున్నా.. మొన్న ఒక కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో అల్లు అర్జున్ కలిసిండు.. మనం డీజే టిల్లు అని పాట కొట్టినం. యూట్యూబ్ లో చూసినవా. అది చార్ట్ బస్టర్ సాంగ్.. అది విన్నడు బట్టలు చింపేసుకున్నడు.. అరే టిల్లు ఇసుమంటి పాటనే కావాలిరాబై' అంటూ హీరోయిన్ వద్ద సిద్ధు జొన్నలగడ్డ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. డీజే అంటే అమితమైన ఇష్టం చూపించే టిల్లు.. రాధికా ఆప్టే (నేహాశెట్టి) ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే ఆమె మరో ముగ్గురి మగాళ్లతో ఆడుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ విషయం తెలుకున్న టిల్లు తన ఫ్రెండ్ తో 'ఒక ల్యాండ్ ఉన్నది.. అది మన సొంతం మన పర్సనల్ అనుకున్నా. కానీ అది ఊర్లో ఉన్న అందరి హౌలాగాళ్ళ పేరు మీదున్నది. ఇంకేమి జేస్తం. అదేదో సెటిల్ మెంట్ ఉంటే హాటల్ కు పోతున్నా' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. అయితే హీరోయిన్ మాత్రం అతను అనుకుంటున్నది నిజం కాదని.. నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాధికా వెనకున్న అసలు కథేంటి? మన డీజే టిల్లు లవ్ స్టోరీకి ఎలా శుభం కార్డు పడిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సిద్ధు జొన్నలగడ్డ విభిన్నమైన పాత్రలో విలక్షణమైన పక్కా హైదరాబాదీ యాసలో మాట్లాడుతూ అలరించాడు. నేహా శెట్టి మరింత గ్లామరస్‌ గా కనిపించింది. సిద్దు - నేహా మధ్య లిప్ లాక్ కిస్సులు - రొమాంటిక్ సన్నివేశాలు.. సిద్దు రాసిన డైలాగ్స్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రిన్స్ సిసిల్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ - కిరీటి ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల - రామ్ మిరియాల సంగీతం సమకూర్చగా.. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు.

సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ - స్క్రీన్‌ ప్లే కూడా రాశారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధీరజ్ మొగిలినేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. యూత్ ని ఆకట్టుకునే లవ్ - ఫన్ అంశాలతో రూపొందిన ''డీజే టిల్లు'' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.