Begin typing your search above and press return to search.

సితార బ్యానర్ లో 'డీజే టిల్లు'

By:  Tupaki Desk   |   25 Aug 2021 1:30 PM GMT
సితార బ్యానర్ లో డీజే టిల్లు
X
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు చిన్న మీడియం రేంజ్ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ.. కొత్త కంటెంట్ ను వెండితెర మీదకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో అర డజను సినిమాల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ''డీజే టిల్లు'' అనే సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు.

'గుంటూరు టాకీస్' 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ''డీజే టిల్లు'' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నేహశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా వదిలిన పోస్టర్ లో ఓ కారు బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ మీద టైటిల్ డిజైన్ చేయబడి ఉంది. 'అట్లుంటది మనతోని' అనేది దీనికి ట్యాగ్ లైన్. కారు మీద 'హిట్టింగ్ టు గివ్ ఎ F*ck' 'సారీ ఆఫీసర్.. మీరు రేసు కోరుకున్నారని అనుకున్నాను' వంటి లైన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో సిద్ధు రాక్ స్టార్ డీజే టిల్లు గా కనిపించనున్నారు.

''డీజే టిల్లు'' చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి స్టోరీ - స్క్రీన్ ప్లే దర్శక హీరోలు ఇద్దరూ కలిసి అందిస్తున్నారు. డైలాగ్స్ కూడా సిద్ధు జొన్నలగడ్డ రాస్తుండటం విశేషం. ఇందులో ప్రిన్స్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ - రవివాట్6 యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇకపోతే విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ - శ్రద్ధ శ్రీనాధ్ హీరోహీరోయిన్లుగా ''నరుడి బ్రతుకు నటన'' అనే చిత్రాన్ని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గతేడాది దీపావళికి ఈ సినిమా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అదే చిత్రాన్ని కొత్త టీమ్ తో ''డీజే టిల్లు'' గా మార్చారా లేదా ఇది మరో కొత్త సినిమానా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక సితార బ్యానర్ లో రూపొందే మలయాళ సూపర్ హిట్ 'కప్పెల' రీమేక్ లో కూడా సిద్ధు హీరోగా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.