Begin typing your search above and press return to search.

మాస్ కా దాస్ గురించి డీజే టిల్లు భ‌లే చెప్పాడే!

By:  Tupaki Desk   |   20 Oct 2022 8:32 AM GMT
మాస్ కా దాస్ గురించి డీజే టిల్లు భ‌లే చెప్పాడే!
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ 'ఓరి దేవుడా!'. అశ్వ‌త్ మారిముత్తు ఈ యూవీ ద్వారా తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిథిలా పాల్క‌ర్‌, ఆశా భ‌ట్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీలో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడిగా కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో పీవీపీ సినిమా బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మించారు.

దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 21న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' వంటి హిట్ ని రీసెంట్ గా త‌న ఖాతాలో వేసుకున్న విశ్వ‌క్ సేన్ అదే జోష్ తో చేసిన సినిమా ఇది. అయితే ఈ మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క అతిథి పాత్ర‌లో దేవుడిగా న‌టిస్తున్నాడ‌ని మేక‌ర్స్ ఎప్పుడైతే ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచే ఈ ప్రాజెక్ట్ పై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. దీపావ‌ళికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో వ‌న్ ఆఫ్ ద హాట్ ఫేవ‌రేట్ గా నిలిచింది.

ఇదిలా వుంటే ఇటీవ‌ల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన చిత్ర బృందం ఆ కార్య‌క్ర‌మానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించి సినిమాపై అంద‌రి దృష్టి ప‌డేలా చేసింది. తాజాగా హైద‌రాబాద్ లో 'దివాళీ దావ‌త్' పేరుతో మ‌రో ఈవెంట్ ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ, అల్ల‌రి న‌రేష్‌, ఆది సాయికుమార్‌, సందీప్ కిష‌న్‌, కార్తికేయ‌, ఆకాష్ పూరి పాల్గొని సంద‌డి చేశారు.  

ఈ సంద‌ర్భంగా 'ఓరి దేవుడా' చిత్ర బృందానికి ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవాలని కోరుకున్నారు. అయితే 'డీజే టిల్లు' సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ మాత్రం ఈ సంద‌ర్భంగా మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసిస్తూనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. త‌న‌దైన పంథాలో విశ్వ‌క్ సేన్ పై ప్ర‌శంస‌లు కురిపించిన సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు.

విశ్వ‌క్ సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. విశ్వ‌క్ నాకు తెలిసిన అత్యంత ఎమోష‌న్స్‌తో కూడుకున్న అంకిత భావం.. సినిమాపై పిచ్చి ప్రేమ‌ వున్న  వ్య‌క్తుల‌లో ఒక‌డు. అత‌ను భ‌విష్య‌త్తులో సూప‌ర్ స్టార్ అవుతాడు.


ఈ విష‌యంలో నేను జోక్ చేయ‌డం లేదు. త‌ను సూప‌ర్ స్టార్ అవుతాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. నేను సినిమా తీస్తాను. విడుద‌ల చేస్తాను.. అంతే కాకుండా దానిని ప్ర‌మోట్ చేయ‌డానికి ఎంత‌కైనా దెగిస్తాను.. అని వ్య‌వ‌హ‌రిస్తాడు. త‌న‌కు సినిమా ప‌ట్ట అంత ప్యాష‌న్, పిచ్చి ఉంద‌న్నాడు. అంతే కాకుండా ఓరి దేవుడా త‌న‌కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని 'సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన తీరు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.