Begin typing your search above and press return to search.

ఇద్దరు బంగార్రాజులను కూడా వెనక్కి నెట్టి టిల్లు గాడు నెం.1

By:  Tupaki Desk   |   15 Feb 2022 12:30 AM GMT
ఇద్దరు బంగార్రాజులను కూడా వెనక్కి నెట్టి టిల్లు గాడు నెం.1
X
2022 సంవత్సరం మొదలు అయ్యి నెలన్నర రోజులు అయ్యింది. ఈ 45 రోజుల్లో తెలుగు నుండి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతికి విడుదల అయిన పలు సినిమాల్లో బంగార్రాజు సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది.

యూఎస్ లో కూడా బంగార్రాజు మంచి కలెక్షన్స్ ను దక్కించుకోవడంతో 2022 లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమా గా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును డీజే టిల్లు దక్కించుకున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

బంగార్రాజు దక్కించుకున్న వసూళ్లను కేవలం రెండు రోజుల్లోనే డీజే టిల్లు యూఎస్ లో దక్కించుకున్నాడు. యూఎస్ లో ప్రీమియర్‌ లు మరియు వీకెండ్‌ షో లతో మంచి వసూళ్లు నమోదు అయినట్లుగా బయర్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాదిలో మేటి చిత్రంగా డీజే టిల్లు నిలిచిందంటూ యూఎస్ లో పంపిణీ చేసిన రాధ కృష్ణ ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ ప్రకటించింది. మరో వీకెండ్‌ లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని హీరోలు ఇద్దరు నాగ చైతన్య మరియు నాగార్జునలు బంగార్రాజు పాత్రల్లో నటించారు. ఇద్దరు బంగార్రాజులు తెగ సందడి చేశారు. సంక్రాంతికి విడుదల అయిన బంగార్రాజు సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా మంచి వసూళ్లు దక్కించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న బంగార్రాజు ను ఇప్పుడు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా డీజే టిల్లు వసూళ్లు రాబడుతున్నాడు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన డీజే టిల్లు ట్రైలర్‌ విడుదల అయినప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి. ఆ సినిమా పై అంచనాలు నమోదు అవ్వడం.. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా యూత్‌ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యేలా ఉండటంతో వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి.

అంతే కాకుండా ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా విడుదల అయిన ఖిలాడి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో డీజే టిల్లు హవా కొనసాగుతోంది.

ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అంటూ యూత్‌ ఆడియన్స్ చాలా నమ్మకంగా ఎదురు చూశారు. అంతా భావించినట్లుగా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకోవడంతో ఈ ఏడాది మేటి చిత్రాల జాబితా లో నిలిచింది. ఈ సినిమా పుట్టుమచ్చల వివాదం ఇంకా ఇతర విషయాలు సినిమాకు బాగా కలిసి వచ్చాయి.

సినిమా లో సిద్దు డైలాగ్స్ యూత్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. కనుక డీజే టిల్లు సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. మరో రెండు వారాల వరకు ఈ సినిమా జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2022 లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో డీజే టిల్లు నెం.1 అనడంలో ఎలాంటి సందేహం లేదు.