Begin typing your search above and press return to search.
రాజమౌళి గారే బెస్ట్ అన్నారు
By: Tupaki Desk | 1 Sept 2017 11:37 AM ISTసినిమా జయపజయాలతో సంబంధం లేకుండా ఛాన్సులను దక్కించుకునే వారిలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకరు. తన టాలెంట్ ను చూపించుకొని మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు నెక్స్ట్ సినిమాకు ఛాన్సులను తప్పకుండా దక్కించుకుంటారు. కానీ ఒక్కోసారి టైమ్ బాలేకపోతే మాత్రం ఎన్ని మంచి బాణీలను ఇచ్చినా అవకాశాలు రావు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు డిజె శ్రీ వసంత్ అనే సంగీత దర్శకుడు.
సుడిగాడు సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పెరు తెచ్చుకున్న వసంత్ పెద్ద సినిమాలకు అవకాశాలు వస్తాయన్నాడు కానీ కేవలం చిన్న తరహా సినిమాలకే మ్యూజిక్ అందించే అవకాశం వచ్చిందిని అంటున్నాడు. అయినా గాని వసంత్ మంచి బాణీలను అందించగలడు అని అందరితో అనిపించుకోవలని ఉంటుందని చెప్పాడు. అలాగే టాప్ టెన్ పాటల్లో నా పాటా ఉండాలనుకొన్నా. అవి రెండూ ‘వైశాఖం’తో నెరవేరాయి. భవిష్యత్తులోనూ మంచి పాటల్ని అందించాలన్న తపనతో పనిచేస్తున్నాని కూడా వసంత్ తెలిపాడు. అలాగే జగపతిబాబు హీరోగా వచ్చిన "పటేల్ సర్" సినిమాకు అందించిన బాణీలు తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యంగా అందులోని 'అవ్వా బుచ్చి' అనే పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
రాజమౌళి గారే ఈ మధ్యకాలంలో నేను విన్న పాటలో ది బెస్ట్ సాంగ్ అని ట్వీట్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని వసంత్ చెప్పాడు. అలనాటి సంగీత దర్శకుడు తాళ్లపళ్లి సత్య గారి మనవాడిగా మెలోడీ సాంగ్స్ అందించడమే తన కోరిక అని చెబుతూ.. ప్రస్తుతం రెండు చిన్న సినిమాలు మరియు మరో కన్నడ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు.
