Begin typing your search above and press return to search.

డీజే లుక్.. అంచనాల్ని ఇంకా పెంచేశాడు

By:  Tupaki Desk   |   16 Feb 2017 7:31 AM GMT
డీజే లుక్.. అంచనాల్ని ఇంకా పెంచేశాడు
X
గత కొన్నేళ్లలో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడి సినిమా అంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. గత ఏడాది ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న బన్నీ.. హరీష్ శంకర్ లాంటి స్టైలిష్ డైరెక్టర్ తో జట్టు కట్టడంతో ‘దువ్వాడ జగన్నాథం’పై ఆరంభం నుంచే మంచి హైప్ నెలకొంది. ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ బయటికి వస్తున్న అప్ డేట్స్ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీని కోసం జనాల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచేలా ఈ రోజు ‘డీజే’ ప్రి లుక్ ను లాంచ్ చేశాడు అల్లు అర్జున్.

‘డీజే’లో బన్నీ బ్రాహ్మణ కుర్రాడి పాత్రను పోషిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా.. దాన్ని నిజం చేసేలా ఉంది ప్రి లుక్. రుద్రాక్ష దండ.. అడ్డ నామాలు.. ఈ వ్యవహారం చూస్తుంటే లుక్ జనాల అంచనాలకు తగ్గట్లే ఉండొచ్చనిపిస్తోంది. డీజే లుక్ ఇన్ 2 డేస్ అంటూ ఈ రోజే హ్యాష్ ట్యాగ్ పెట్టి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందిస్తుండటాన్ని బట్టి ఈ ఫస్ట్ లుక్ పై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది. ఈ చిత్రంలో బన్నీ లుక్ చాలా కొత్తగా ఉండబోతోందని దర్శకుడు హరీష్ శంకర్ ఇంతకుముందే చెప్పాడు. మరి ఇంకో రెండు రోజుల్లో బయటికి రానున్న బన్నీ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/