Begin typing your search above and press return to search.

సభ్య సమాజంలో డిజె విగ్రహాలు

By:  Tupaki Desk   |   26 Aug 2017 1:27 PM IST
సభ్య సమాజంలో డిజె విగ్రహాలు
X
మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఇప్పుడు వినాయక చవితికి కొత్త కొత్త తరహాలో వినాయకుడి విగ్రహాలను తయారుచేయడం అనేది ఒక క్రేజ్. అయితే ఒకప్పుడు వినాయకుడిని రకరకాల అవతారాల్లో చేసే విగ్రహాల తయారుదారులు ఇప్పుడు మాత్రం సినిమా వాళ్ళ అవతారాల్లో చేస్తున్నారు. కొన్ని సినిమమాల్లోని హీరోల లుక్స్ బాగా హిట్టవ్వడంతో.. అదే లుక్కులో వినయాకుడ్ని దించేస్తున్నారు.

అదిగో అక్కడ ఢిల్లీలో అయితే ఈ ఏడాది ట్రెడిషనల్ గా ఉన్న విగ్రహాలకంటే కూడా.. బాహుబలి షేపులో ఉన్న వినాయకుడి విగ్రహాలే ఎక్కువగా అమ్ముడుపోయాయ్. మన దగ్గర వరంగల్ లో ఏకంగా వరంగల్ జిల్లా కలక్టర్ ఆమ్రపాలి కాటా విగ్రహాలను తయారుచేయించి.. ఆమె ఒడిలో వినాయకుడు ఉన్నట్లు ఒక విగ్రహం చేయించారు. ఇంకో చోట అయితే ఏకంగా డిజె దువ్వాడ జగన్నాథమ్ తరహాలో వినాయకుడ్ని తయారు చేశారు. పసుపు రంగు స్కూటర్ మీద వెళ్తుంటే జగన్నాథ శర్మ ఎలా ఉంటాడో.. వినాయకుడు అలాగే ఉన్నాడు. సభ్య సమాజంలో ఇప్పుడు ఇటువంటి విగ్రహాలే దర్శనమిస్తున్నాయి.

మొత్తానికి వినాయకుడి విగ్రహాలంటే సినిమా క్యారెక్టర్లు అనే తరహాలో మారిపోయింది సమాజం. దీని వలన సమాజానికి సరైన మెసేజ్ అయితే వెళ్ళట్లేదు. అద్దంతరంగా వానలు పడి నగరాలు నీటిమయం అవుతుంటే.. అది కేవలం ఇలాంటి విగ్రహాల వలనే అంటున్నారు పెద్దలు. ఏమంటారు?