Begin typing your search above and press return to search.
`పుష్ప` మేనియాకు మరో క్రికెటర్ ఫిదా
By: Tupaki Desk | 25 Jan 2022 7:08 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప :ది రైజ్` క్రేజ్ ఎల్లలు దాటి హల్ చల్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ మేనియా నెలరోజులు దాటినా తగ్గడం లేదు. రోజు రోజుకీ దేశ విదేశాల్లో వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. బన్నీ - సుక్కుల కలయికలో రూపొందిన మూడవ చిత్రమిది.
ఈ సినిమాతో బన్నీ స్టార్ డమ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. అంతకు మించి బన్నీ సినిమాని సెలబ్రిటీలు, క్రేజీ క్రికెటర్లు, టిక్ టాక్, యూట్యూబ్ స్టార్స్ ప్రచారం చేస్తుండటం.. ఈ మూవీలోని పాటలకు క్రేజీ స్టెప్పులు వేస్తూ వైరల్ చేస్తుండటం.. మరీ ముఖ్యంగా మన క్రికెటర్ల నుంచి ఇతర దేశాలకు చెందిన పాపులర్ క్రికెటర్స్ ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్ లకు `పుష్ప` సిగ్నేచర్ స్టెప్స్ వేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.
ఇప్పటికే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శ్రీవల్లి పాటకు పుష్ప సిగ్నేచర్ స్టెప్స్ ని రీక్రియేట్ చేస్తూ హంగామా చేశాడు. ఆ తరువాత `పుష్ప` ట్రెండింగ్ డైలాగ్ తో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ ఈ జాబితాలో చేరాడు. తనే వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో. `పుష్ప` మేనియాకు ఫిదా అయిపోయాడు. హిందీ వెర్షన్ లోని శ్రీవల్లి .. సాంగ్ కి బ్రావో సిగ్నేచర్ స్టెప్స్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయాన్ని `పుష్ప` టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
విండీస్ స్టార్ బ్రావో `పుష్ప` సిగ్నేచర్ స్టెప్స్ ట్రెండ్ లో జాయిన్ అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంలోని శ్రీవల్లి సాంగ్ ని విండీస్ స్టార్ బ్రావో రీక్రియేట్ చేశారని, బ్రావో వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. `పుష్ప` విడుదలై నెల రోజులు దాటినా ఇప్పటికీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ మూవీ మేకర్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. ఈ క్రేజ్ `పుష్ప -2` బిజినెస్ పై ప్రభావం చూపుతుందని, మరింత డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట.