Begin typing your search above and press return to search.
ఓటీటీలకి కలిసొచ్చిన దీపావళి సీజన్..!
By: Tupaki Desk | 16 Nov 2020 3:40 PM ISTదీపావళి పండుగ వచ్చిందంటే కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుంది. కానీ ఈ దీపావళికి మాత్రం ప్రేక్షకులు థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కరోనా కారణంగా మూతబడి ఉన్న థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్రం కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. అయినప్పటికీ సంపూర్ణంగా థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. దీన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ క్యాష్ చేసుకున్నాయి.
నిజానికి పర్మిషన్ వచ్చిన వెంటనే థియేటర్స్ తెరిచి ఉంటే.. సినిమాలు ఈ టైమ్ లో రిలీజ్ చేయండి, ఆ టైమ్ లో రిలీజ్ చేయడంటూ పండగ సీజన్ల గురించి సినీ నిపుణులు సలహాలు ఇస్తూ ఉండేవారు. అయితే కరోనా వచ్చి ఈ లెక్కలన్నీ ప్రస్తుతానికి ఆపేసింది. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజులు కూడా సీజనల్ రిలీజులు చేస్తున్నారు. అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజులకి ఈ ఏడాది సమ్మర్ సీజన్.. ఆ తరువాత వచ్చిన దసరా సీజన్ నిరాశే మిగిల్చింది. ఓటీటీలలో విడుదలైన సినిమాలన్నీ దాదాపు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నవే.
కానీ దీపావళి సీజన్ మాత్రం ఓటిటిలకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీపావళికి రిలీజైన అన్ని ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. సినిమా కోసం థియేటర్ల వైపు చూసే జనాలు.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి కూర్చొని కొత్త సినిమాలతో ఈ కలర్ ఫుల్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి రాబోయే క్రిస్మస్ మరియు సంక్రాంతి సీజన్ లో డైరెక్ట్ ఓటీటీ స్లాట్ లో వచ్చే సినిమాలు కూడా ఇదే హవా కొనసాగిస్తాయేమో చూడాలి.