Begin typing your search above and press return to search.

తమిళ తంబీలకు అసలైన దీపావళి

By:  Tupaki Desk   |   10 Nov 2015 4:42 AM GMT
తమిళ తంబీలకు అసలైన దీపావళి
X
తమిళనాట స్టార్ కి క్రేజ్ మనతో పోల్చుకుంటే ఒకింత ఎక్కువగానే కనిపిస్తుంది. వారి ప్రియతమ హీరోలపై వారు చూపించే అభిమానం అటువంటిది. సినిమా థియేటర్ లోకి చెప్పులు తీసేసి వెళ్ళడం. విడుదల రోజున ఉపవాసాలు వుండడం వంటివి వీటికి ప్రతీక. ఇక తమిళనాట దీపావళి పండగను పురస్కరించుకుని రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదలకానున్న నేపధ్యంలో వారికి అసలు సిసలైన దీపావళి శోభ సంతరించుకుంది.

అజిత్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న వెధాలమ్ సినిమా ఇప్పటికే మాస్ కి చేరువైంది. చెన్నై డాన్ కలకత్తాలో సాధారణ జీవితం ఎందుకు గడుపుతున్నాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండని దర్శకుడు శివ ఊరించాడు. సినిమా ఇప్పటికే ప్రిమియర్ షోలను పూర్తిచేసుకుంది. కధాకధనాలు కాస్త నిమ్మదిగా వున్నా అజిత్ అభిమానులకు పునకాలు తెప్పించడం ఖాయమట.

ఇక కమల్ చీకటి రాజ్యమనే థ్రిల్లర్ తో మనల్ని పలకరించానున్నారు. ఒక రాత్రి సాగే కధానేపధ్యంలో సినిమా నడుస్తుందని, ఒక ఫ్రెంచ్ సినిమాను ఆధారంగా తీసుకుని తీసిన చిత్రమని తెలిపారు. ఇందులో డ్రగ్ ఆఫీసర్ గా కమల్ కనువిందు చేయనున్నారు. త్రిష హీరోయిన్. ఈమెతో కమల్ ఘాటైన లిప్ లాక్ లో సైతం నటించినట్టు తెలుస్తుంది.