Begin typing your search above and press return to search.

దీపావళి బాక్సాఫీస్ వార్‌ దసరా పోరును మించి..!

By:  Tupaki Desk   |   13 Oct 2022 7:30 AM GMT
దీపావళి బాక్సాఫీస్ వార్‌ దసరా పోరును మించి..!
X
దసరాకు చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌.. నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ మరియు బెల్లంకొండ సాయి గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. మూడు సినిమాలు కూడా విడుదలకు ముందు చాలా అంచనాలను మూట కట్టుకున్నాయి. కానీ తుది ఫలితం మాత్రం గాడ్‌ ఫాదర్‌ కి మాత్రమే పాజిటివ్‌ గా దక్కింది.

చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ మాత్రమే భారీ వసూళ్లను నమోదు చేసింది.. ఇంకా రాబడుతూనే ఉంది. ఇక దీపావళి సీజన్ ఆరంభంకు అంతా సిద్ధంగా ఉంది. దీపావళికి కచ్చితంగా వినోదాల విందు ను యంగ్‌ స్టార్స్ అందించబోతున్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద దీపావళికి పటాసులు చాలానే పేళబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

దీపావళికి తమిళ స్టార్‌ హీరో కార్తీ నటించిన సర్దార్‌ విడుదల కాబోతుందా లేదా అనే విషయమై ఉన్న అనుమానాలకు తెర దించారు. తెలుగు లో కూడా దీపావళి సందర్భంగానే సర్దార్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. దీపావళి సందర్భంగా సినిమా ను అక్కడ ఇక్కడ విడుదల చేయబోతున్నట్లుగా కార్తీ తెలుగు పోస్టర్ ను విడుదల చేశాడు.

సర్దార్‌ తో పాటు దీపావళికి శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ చిత్రం విడుదల కాబోతుంది. అంతే కాకుండా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా కూడా దీపావళి సందర్భంగా విడుదల కాబోతుంది. ఇన్నీ చాలవన్నట్లుగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా దీపావళికే విడుదల కాబోతుంది.

యంగ్ హీరోలు.. తెలుగు లో గతంలో మంచి సక్సెస్ లను దక్కించుకున్న స్టార్స్ ఈ దీపావళికి వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని సినిమాల్లోకి జాతిరత్నాలు దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమాపై తెలుగు లో ఒకింత ఆసక్తి ఎక్కువ ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఆ తర్వాత ఓరి దేవుడా సినిమాను కూడా జనాలు చూడాలి అనుకుంటున్నారు. ఇక సర్దార్‌ కి సక్సెస్ టాక్‌ వస్తే తప్పకుండా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది. మరి దీపావళి రేస్ లో విజేతలుగా నిలిచే సినిమాలు ఏంటో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.