Begin typing your search above and press return to search.

దూకుడు పెంచనున్న దివ్యాన్ష కౌశిక్!

By:  Tupaki Desk   |   27 Jun 2021 8:00 AM IST
దూకుడు పెంచనున్న దివ్యాన్ష కౌశిక్!
X
తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు .. తమ అందాల సుగంధాలను వెదజల్లుతూనే ఉంటారు. వారిలో సన్నజాజి కాడలాంటి నాజూకైన అమ్మాయిలూ ఉంటారు .. ముద్దబంతిలా కాస్త బొద్దుగా ఉండే భామలు ఉంటారు. సాద్యమైనంత వరకూ చక్కని కనుముక్కుతీరుతోనే హీరోయిన్లు మనసులు ఖాళీ చేసేస్తుంటారు .. గుండెలు గుల్ల చేస్తుంటారు. అలాంటి గ్లామర్ తో ఈ మధ్యలో తెలుగు తెరకి పరిచయమైన పడుచు పాలరాతి శిల్పం 'దివ్యాన్ష కౌశిక్'.

కోర చూపులతో ఆరారగా కుర్రాళ్ల హృదయాలను టచ్ చేసే ఈ అమ్మయి, 'మజిలీ' సినిమా ద్వారా పరిచయమైంది. ఈ సినిమాలో ఈ పిల్లను చూసిన కుర్రాళ్లంతా, ఇంటికి వెళ్లబుద్ధికావడం లేదంటూ థియేటర్లలోనే నాలుగు ఆటల పాటు నడుం వాల్చేశారు. అంతలా ఈ అమ్మాయి సొగసుల మంత్రం వేసింది .. తపనల తంత్రం చేసింది. ఈ అమ్మాయి నవ్వులో ఏదో ఉంది .. నడకలో ఏదో ఉంది అని ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసినవారు చాలామందే ఉన్నారు. కానీ ఎవరికీ ఇంతవరకూ అంతుబట్టలేనట్టే అనిపిస్తోంది.

'మజిలీ' సినిమా హిట్ సమంత ఖాతాలో పడిపోవడంతో, 'దివ్యాన్ష కౌశిక్'కి రావాల్సినంత క్రేజ్ రాలేదు. అయినా తనేమిటనేది నిరూపించుకోవాలనే కసితోనే అడుగు ముందుకు వేసింది. కానీ కరోనా వలన అందరితో పాటే గ్యాప్ వచ్చేసింది. తాజాగా ఈ అమ్మాయి రవితేజ సరసన ఒక సినిమా చేస్తోంది. శరత్ మండవ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాతో తనకి బ్రేక్ రావడం ఖాయమని చెబుతోంది. అంతేకాదు వరుసగా కథలను వింటూ, తన స్పీడ్ పెంచే పనిలో పడిందని అంటున్నారు. చూస్తుంటే కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చేట్టే కనిపిస్తోంది.