Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా 'మైఖేల్' లో దివ్యాన్ష

By:  Tupaki Desk   |   18 Dec 2021 1:32 PM GMT
పాన్ ఇండియా మైఖేల్ లో దివ్యాన్ష
X
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ హీరోగా విలక్షణ పాన్ ఇండియా స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మైఖేల్. ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. తెలుగు తో పాటు తమిళం ఇతర అన్ని సౌత్ భాషల్లో మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. సినిమా కథ గ్లోబల్‌ అప్పీల్‌ ను కలిగి ఉంటుందని అంటున్నారు. మైఖేల్‌ సినిమా లో సందీప్‌ కిషన్ మరియు విజయ్ సేతుపతిల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని అంటున్నారు. వీరిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు ఆ మద్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ను ప్రకటించారు.

హాట్ బ్యూటీ దివ్యాంష కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాదితో పాటు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కూడా మజిలి సినిమా తో ఈమె సుపరిచితురాలు అయ్యింది. అందుకే దివ్యాంష కౌశిక్‌ అయితే ఈ సినిమా లో పాన్ ఇండియా అప్పీల్‌ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో దివ్యాంష కౌశిక్ నటించడం వల్ల హిందీలో కూడా సినిమాకు బజ్ క్రియేట్‌ అవుతుందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్తరాదిన కూడా మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి.

ఈ సినిమా కూడా అక్కడ మంచి ఆధరణ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. తమిళం మరియు మలయాళంలో విజయ్ సేతుపతి ఉండటం వల్ల ఖచ్చితంగా మంచి ఆధరణ దక్కుతుంది. కనుక మైకేల్‌ సినిమా కాస్త పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో సందీప్‌ కిషన్‌ కు ఇదో మంచి సినిమా గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మైఖేల్‌ సినిమా చిత్రీకరణ కు కరోనా వల్ల బ్రేక్ లు పడుతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు సినిమా ను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.