Begin typing your search above and press return to search.

#కోవిడ్19.. వెంటిలేట‌ర్ పై న‌టి సీరియ‌స్.. బ‌తికించ‌డానికి సోద‌రుడి త‌ప‌న‌!!

By:  Tupaki Desk   |   2 Dec 2020 9:30 AM IST
#కోవిడ్19.. వెంటిలేట‌ర్ పై న‌టి సీరియ‌స్.. బ‌తికించ‌డానికి సోద‌రుడి త‌ప‌న‌!!
X
కోవిడ్ -19 త‌ర‌త‌మ భేధం లేకుండా అంద‌రినీ వెంటాడుతోంది. మ‌హ‌మ్మారీ ఇప్ప‌టికే ప‌లువురు సినీసెల‌బ్రిటీల‌ను బ‌లిగొంది. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం.. లెజెండ‌రీ బెంగాలీ న‌టుడు సుమిత్ర ఛ‌ట‌ర్జీ కోవిడ్ తో మ‌ర‌ణించారు. అయితే చాలామంది స్టార్లు కోవిడ్ ను జ‌యించి క్షేమంగా ఇండ్ల‌కు చేరుకోవ‌డంతో అభిమానుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మైంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి దివ్య భట్నాగర్ కోవిడ్ కి వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నారు. కోవిడ్ సోక‌క ముందే స‌ద‌రు న‌టీమ‌ణి న్యుమోనియాతో బాధపడుతున్నార‌ని స‌మాచారం. ఆమె సోదరుడు దేవాషిష్ వెంటి లేటర్ ‌లోనే ఉన్నట్లు వెల్లడించాడు. త‌న‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని అత‌డు వెల్ల‌డించాడు.

కొరోనావైరస్ పాజిటివ్ అని ప‌రీక్ష‌లో తెలిసిన‌ కొన్ని రోజుల తరువాత దివ్య భట్నాగర్ ప‌రిస్థితి సంక్లిష్ఠంగా మారింది. అటుపై వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నార‌. నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ నుంచి దివ్య భట్నాగర్ ను ఇటీవ‌ల‌ వెంటిలేటర్ కి మార్చార‌ని ఆమె సోదరుడు దేవాషిష్ వెల్లడించారు. వైర‌స్ సోక‌క ముందే `యే రిష్టా క్యా కెహ్లతా హై` న‌టి దివ్య న్యుమోనియాతో బాధపడుతున్నారని ఆయన అన్నారు.

దివ్య ఇటీవల ఇన్ ‌స్టా లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి,.. “హాయ్ మై ఇన్ ‌స్టాగ్రామ్ ఫ్యామిలీ. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. ” అంటూ ఆసుపత్రి మంచంపై నుంచే నవ్వుతూ కనిపించింది. అప్పుడు ఆమెకు ఆక్సిజ‌న్ ని వైద్యులు ఏర్పాటు చేశారు. న్యూమోనియా ఉండ‌డం వ‌ల్ల శ్వాస‌సంబంధ స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మైంద‌ని ఆ క్ర‌మంలోనే ప‌లు ఆస్ప‌త్రుల‌కు తిప్ప‌డంతో ఒత్తిడి పెరిగింద‌ని ఆమె సోద‌రుడు వెల్ల‌డించారు. 63 ఏళ్ల త‌న త‌ల్లిగారు ముంబై ఆస్ప‌త్రి వ‌ద్ద ఉన్నా.. త‌న‌ను లోనికి రానివ్వ‌న‌ని తానే పీపీఈ కిట్ల‌తో వెళ్లి సోద‌రిని కలుస్త‌న్నాన‌ని తెలిపారు.

యే రిష్టా క్యా కెహ్లతా హై .. తేరా యార్ హూన్ మెయిన్ ..వంటి కార్య‌క్ర‌మాల‌తో పాటు దివాన్ ఉడాన్.. జీత్ గయి తోహ్ పియా మోరే ...విష్ వంటి టీవీ షోలలో కూడా దివ్య‌ పనిచేశారు.