Begin typing your search above and press return to search.
దివ్యభారతి ఎలా చనిపోయింది..?
By: Tupaki Desk | 7 April 2023 4:13 PM ISTనటించిన అతి కొద్ది సినిమాలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ దివ్య భారతి. స్టార్ ఇమేజ్ తో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ఆమె 1993 ఏప్రిల్ 5న మృతి చెందారు. అందాల తార మరణాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. సినీ ప్రముఖులు, అభిమానులకు దివ్యభారతి మృతి విషాదాన్ని మిగిల్చింది. దివ్యభారతి మృతి చెంది 30 ఏళ్లు అవుతున్నా ఆమె మరణం వెనక ఉన్న కారణాలు మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి. హీరోయిన్ ఎలా మృతి చెందారన్న విషయాలపై కొన్ని సందేహాలు ఉన్నాయి.
దివ్యభారతి మరణానికి కొన్ని గంటల ముందు చెన్నైలో షూటింగ్ ముగించుకుని ముంబైకి చేరారు. అక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్ తో తాను నటించబోయే ఆందోళన్ సినిమా పాత్రకు కావాల్సిన కాస్టూమ్స్ గురించి మాట్లాడారు. ఆ టైం లోనే బాల్కనీ పిట్టగోడ మీద నుంచి జారి కింద పడి మృతి చెందారు.
దివ్య భారతి మృతిపై చాలా రకాల రూమర్లు వచ్చాయి. మీడియా కథనాలు ప్రకారం నీతా లుల్లా, శ్యాం తో కలిసి దివ్య భారతి మద్యం సేవించారని.. ఆ టైం లో బాల్కనీ గోడ మీద కూర్చుని ఉండగా కాలు జారి కిందపడి మృతి చెందారని వార్తలు వచ్చాయి.
గాయాలతో మృత్యువుతో పోరాటం చేసిన దివ్య భారతి ఐదో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు అని కథనాలు వచ్చాయి.
దివ్యా భారతి తండ్రి మాత్రం దివ్య భారతి మృతిపై వస్తున్న వార్తలను ఖండించారు. సూసైడ్, మర్డర్ అంటూ ఆరోపణలు ఆయన తోసిపుచ్చారు. ఆమె డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. తన కూతురు ప్రమాదవశాత్తు బాల్కనీ గోడ మీద కూర్చొని జారి పడిపోయింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చారు.
ఆమె మరణంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టివేశారు. నా కూతురికి ఎలాంటి అలవాట్లు లేవు. మద్యం సేవించలేదు అని ఆయన అన్నారు. అర్ధగంటలో ఎంత మధ్య సేవిస్తారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అపార్ట్ మెంట్స్ లో అన్ని ఫ్లాట్స్ కి గ్రిల్స్ ఉన్నాయి. దివ్య భారతి ఉండే ఫ్లాట్ లో గ్రిల్స్ లేవు.. గోడపై నుంచి జారి కిందపడి మరణించిందని ఆయన దివ్యభారతి మృతిపై వస్తున్న వారలన్నిటికి సమాధానం ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.