Begin typing your search above and press return to search.
విడాకులు తీసుకున్న హీరోయిన్స్ కు జీవితం లేదా?
By: Tupaki Desk | 12 Dec 2021 6:00 AM ISTసోషల్ మీడియాలో సెలబ్రెటీలు ప్రశంసలతో పాటు ట్రోల్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ బ్యాడ్ కామెంట్స్ ను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ బ్యాడ్ కామెంట్స్ కు కొందరు స్పందిస్తారు.. మరి కొందరు సైలెంట్ గా ఉంటారు. కాని సోషల్ మీడియాలో కొందరు మాత్రం తమపై వచ్చే ట్రోల్స్ కు సీరియస్ గా స్పందిస్తూ ఉంటారు.
తాము అనుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమను విమర్శించే వారికి చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల స్పందించే వారిలో హీరోయిన్ కామ్యా పంజాబీ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆమె ఇలాంటి విషయాల పట్ల చాలా సీరియస్ గా ఉంటారు. ఆమె ప్రతి సందర్బంలో కూడా తనను ట్రోల్ చేసిన వారికి సమాధానం చెబుతూనే ఉంటుంది.
తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఈమె రెండు పెళ్లిల విషయమై ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడు. అతడి ట్రోల్ కు కామ్యా ఏమాత్రం తడుముకోకుండా అతడిపై ఫైర్ అయ్యింది. ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ.. మీరు మీ మొదటి వివాహంను కొనసాగించకుండా విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకున్నారు.
దీనికి హద్దులు లేవా అంటూ అతడు కామెంట్ చేశాడు. అతడి కామెంట్ కు స్పందించిన కామ్యా అసలు ఆడవారు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత బతక కూడదు అని మీరు అనుకున్నట్లుగా ఉన్నారు అంటూ చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.
మీ ఉద్దేశ్యంలో మహిళలు సంతోషంగా ఉండకూడదా.. విడాకులు తీసుకున్న ప్రతి మహిళ చనిపోవాలా.. విడాకులు తీసుకున్న సెలబ్రెటీలకు జీవితం లేదా అంటూ అసహనం వ్యక్తం చేసింది. సమాజంలోని ప్రతి మహిళ కూడా నీలాంటి వారికి సమాధానం చెబుతూ ధైర్యంగా జీవనం సాగించే రోజులు రావాలని కోరుకుంటున్నాను అంటూ అతడి తీరును తీవ్రంగా ఆక్షేపించింది.
నన్ను బలహీనురాలిగా భావించి చేసే విమర్శలు నన్ను మరింత బలవంతురాలిగా మార్చుతాయి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆడవారు ఎప్పుడు కూడా బలహీనులు కారు అంటూ ఆమె పేర్కొంది.