Begin typing your search above and press return to search.

హార్లీ డేవిడ్స‌న్ పై దివి థై-థండ‌ర్ ఎలివేష‌న్!

By:  Tupaki Desk   |   14 Aug 2021 6:08 AM GMT
హార్లీ డేవిడ్స‌న్ పై దివి థై-థండ‌ర్ ఎలివేష‌న్!
X
న‌టి.. మోడ‌ల్ దివి వ‌ద్య‌త బిగ్ బాస్ బ్యూటీగా తెలుగు వారికి సుప‌రిచితం. `మ‌హ‌ర్షి`లో పూజాహెగ్గే ప్రెండ్ క్యారెక్ట‌ర్ లో న‌టించిన దివి ఆ త‌ర్వాత కొన్ని స‌హాయ‌క‌ పాత్ర‌ల‌తోనూ ఆక‌ట్టుకుంది. అయితే దివిలో న‌టిని హాట్ కంటెంట్ డామినేట్ చేయ‌డం ప‌రిశ్ర‌మ గ్ర‌హించి ఆ దిశ‌గా అవ‌కాశాల్ని విస్త‌రిస్తోంది.

ఇక బిగ్ బాస్ బ్యూటీ దివికి సోష‌ల్ మీడియా అభిమానుల‌కు ఎక్కువ‌గా ట‌చ్ లో ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాటెస్ట్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి హీటెక్కిస్తోంది. ఇప్ప‌టికే ఇన్ స్టా బ్యూటీగా బాగా పాపుల‌ర్ అయింది. నిరంత‌రం కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ల‌తో అభిమానుల‌ను అల‌రించ‌డం త‌న‌కి ఫాలోయింగ్ ని పెంచుతోంది. గ్లామరస్ లుక్ తో పాటు .. ట్రెడిష‌నల్ గాళ్ గాను దివి వైర‌ల్ గా దూసుకెళుతోంది.

తాజాగా దివి థై-థండ‌ర్ షోస్ తో సునామీ సృష్టిస్తోంది. ఇదిగో ఇలా హార్లీ డేవిడ్ స‌న్ బైక్ పై సాహ‌సాల‌కు సిద్ధ‌మైంది దివి. చినుగుల డెనిమ్ నిక్క‌రు ధ‌రించి థై అందాల్నిఎలివేట్ చేస్తోంది. షార్ట్ లో ప్లామ్ బోయెంట్ అవ‌తారంలో కుర్ర‌కారుని ఫిదా చేస్తోంది. టాప్ టు బాట‌మ్ హాటెస్ట్ లుక్ ని ఎలివేట్ చేయ‌డంపైనే దివి ఫోకస్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీవి లుక్ పై ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ కామెంట్లు ప‌తాక స్థాయికి చేరుతున్నాయి.

హైద‌రాబాద్ కి చెందిన దివి నారాయ‌ణ‌మ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం `బిగ్ బాస్ సీజ‌న్-4 `కంటెంస్టెంట్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో దివి పెర్ఫామెన్స్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `లెట్స్ గో` అనే చిత్రం దివి తొలి సినిమా. కానీ ఆ సినిమా అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన‌ `మ‌హర్షి`లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర‌తో ఆడియ‌న్స్ కి రీచ్ అయింది. ఇప్పుడిప్పుడే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. సోష‌ల్ మీడియా క్వీన్ గా టాప్ మోడ‌ల్ గా ఆదాయ ఆర్జ‌న బావుంద‌ని తెలిసింది. న‌టిగా కెరీర్ ప‌రంగా కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తోంది. మునుముందు మెగా అక్కినేని కాంపౌండ్స్ నుంచి ఆఫ‌ర్లు ఉంటాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఆ మేర‌కు బిగ్ బాస్ షోలో దివికి చిరు- నాగ్ ప్రామిస్ చేశారు. టాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీ ఎంత వ‌ర‌కూ రాణిస్తుందో చూడాలి.