Begin typing your search above and press return to search.

చీర‌కట్టులో బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లాక్ చేసిందిగా

By:  Tupaki Desk   |   19 April 2021 6:30 AM GMT
చీర‌కట్టులో బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లాక్ చేసిందిగా
X
చిల్లుబుగ్గ‌ల‌తో కుర్ర‌కారు మైండ్ బ్లాక్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య‌. న‌వ్వితే చాలు బుగ్గ చిల్లులు జూమ్ చేస్తాయి. బిగ్‌బాస్-4 సీజన్ లో ఈ బ్యూటీ కి భీభ‌త్స‌మైన ఫాలోయింగ్ పెరిగింది అంటే అంత‌టి అంద‌చందాలు క‌వ్వింత ఈ అమ్మ‌డిలో పుష్క‌లంగా ఉన్నాయి గ‌నుకే.

దివి హైద‌రాబాదీ బ్యూటీ. మోడ‌ల్ గా కొన‌సాగుతూనే.. టాలీవుడ్ లో చాలా సినిమాల్లో చిన్నచిన్న పాత్ర‌ల్లో న‌టించింది. ఇక బిగ్ బాస్ 4 ఎపిసోడ్స్ ముగిశాక తెలుగు చిత్ర సీమ అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి-నాగార్జున త‌న‌కు అవ‌కాశాలిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ప్ర‌స్తుతం ఈ భామ‌ కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌తో పాటు.. క‌థానాయిక‌గానూ ఆఫ‌ర్లు ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. ఓ రెండు చిన్న సినిమాల్లో నాయిక‌గా న‌టిస్తోందిట‌. ఇక దివీకి సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ ఓ రేంజులోనే ఉంది. ఇన్ స్టా వేదిక‌పై నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో దివి ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా చీర‌క‌ట్టులో సొగ‌సును వ‌డ్డించింది. ప‌సుపు రంగు చీర కాంబినేష‌న్ ర‌వికెలో కిల్ చేస్తోంది ఈ బ్యూటీ. వాలు చూపుల‌తో గాలం వేస్తున్న ఈ బ్యూటీకి వీర లెవ‌ల్లో ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దివీ ఫోటోలు దూసుకెళుతున్నాయి.