Begin typing your search above and press return to search.

హాట్‌ ఫొటోలతో హీట్‌ పెంచుతున్న బిబి బ్యూటీ

By:  Tupaki Desk   |   26 Nov 2020 3:00 PM GMT
హాట్‌ ఫొటోలతో హీట్‌ పెంచుతున్న బిబి బ్యూటీ
X
తెలుగు బిగ్‌ బాస్ లో ప్రత్యేకంగా నిలిచిన ముద్దుగుమ్మ దివి అన్యూహ్యంగా దసరా రోజు ప్రత్యేక ఎపిసోడ్‌ లో సమంత చేతుల మీదుగా ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆమె ఎలిమినేట్‌ అయిన తర్వాత బిగ్‌ బాస్‌ ఇమేజ్‌ ను బాగానే క్యాష్‌ చేసుకుంటుంది అనిపిస్తుంది. హీరోయిన్‌ అవ్వాలి అనేది తన లక్ష్యంగా చెప్పుకుంటున్న ఈ అమ్మడు అందుకు సంబంధించి హాట్‌ ఫొటో షూట్‌ లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ అమ్మడు తాజాగా ఫొటో షూట్‌ లను చూస్తుంటే ఖచ్చితంగా హీరోయిన్‌ గా ఓ రేంజ్‌ లో ఎంటర్‌ టైన్‌ చేయడం ఖాయం అనిపిస్తుంది.

గతంలో కూడా ఇన్‌ స్టా గ్రామ్‌ లో రెగ్యులర్‌ గా ఈ అమ్మడు ఫొటోలను షేర్‌ చేసేది. కాని ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఈమె ఫొటో షూట్‌ లకు ఫోజ్‌ లు ఇస్తుంది. ఈమె చేస్తున్న ఫొటో షూట్‌ లు ఆఫర్లు తెచ్చి పెడుతాయా అంటే ఖచ్చితంగా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈమెకు రెండు ఆఫర్లు వచ్చాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది. ఈమెకు తమిళం నుండి కూడా పిలుపు వస్తున్నట్లగా చెబుతున్నారు. ఖచ్చితంగా ఈమె ఒక సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. నటిగా ఒక్క ఛాన్స్‌ ఇస్తే నిరూపించుకునేందుకు ఈ అమ్మడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ హాట్‌ ఫొటోలతో అమ్మడికి ఆ ఒక్క ఛాన్స్‌ ఏం కర్మ భారీగా ఆఫర్లు దక్కించుకుంటోంది. వచ్చే ఏడాది దివి హీరోయిన్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది.