Begin typing your search above and press return to search.

లావెండ‌ర్ బ్యూటీ దివి మైండ్ బ్లోయింగ్ శారీ లుక్

By:  Tupaki Desk   |   29 July 2021 4:30 PM GMT
లావెండ‌ర్ బ్యూటీ దివి మైండ్ బ్లోయింగ్ శారీ లుక్
X
బిగ్ బాస్ సీజ‌న్ 4లో వేడెక్కించే పెర్ఫామెన్స్ తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లింది దివి వ‌ద్య‌త‌. త‌న‌దైన అందం చందం క‌వ్వించే వయ్యారంతో దివి అంద‌రికీ పిచ్చిగా న‌చ్చేసింది. ఇక దివి అంద‌చందాల‌కు ప్ర‌తిభ‌కు మంత్ర‌ముగ్ధులైన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు త‌న‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ దివి చాలా బిజీ ఆర్జ‌కురాలిగా ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ప్ర‌తిభ‌ను నిరూపించుకునేందుకు ఒక వేదిక దొరికితే ఇలాంటి ఎంద‌రో తెలుగ‌మ్మాయిలు మునుముందు తెలుగు చిత్ర‌సీమ‌లో వెలుగు చూస్తారు. ఇక బిగ్ బాస్ వేదిక ద్వారా ప‌రిచ‌య‌మై ప‌లువురు న‌టీన‌టులు ఇప్పటికే బుల్లితెర వెండితెర రంగంలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే.

దివి ఇంత‌కుముందే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. ఈ అమ్మడి అంద‌చందాలు న‌ట‌న యూత్ కి మ‌త్తెక్కించాయి. మునుముందు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు సినిమాల్లో మంచి అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయ‌ని స‌మాచారం. ఇటీవ‌ల టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ - 2020 జాబితాలో దివి అగ్ర ప‌థాన నిలిచి మ‌రోసారి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంది.

దివి వ‌ద్య‌త‌ ఇన్ స్టా మాధ్య‌మంగానూ భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా వేదిక‌పై ద‌ర్శ‌న‌మిస్తోంది. దివి వ‌ద్య‌త లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. దివి చీర‌లో ఎంతో ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఎంతో ప్లెజెంట్ గా క‌నిపిస్తోంది. వంగ‌పువ్వు రంగు చీర‌.. కాంబినేష‌న్ బ్లౌజ్ లో దివి ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపిస్తోంది. అంత‌కుమించి అంద‌మైన‌ చిరున‌వ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కోసేస్తోంది.