Begin typing your search above and press return to search.

దివి మేకోవ‌ర్ కు కుర్ర‌కారు స‌లాం గులాం

By:  Tupaki Desk   |   5 Jun 2021 11:30 AM GMT
దివి మేకోవ‌ర్ కు కుర్ర‌కారు స‌లాం గులాం
X
దివి అందం మెరిసిపోతోంది.. మిరుమిట్లుగొలుపుతోంది. ఎర్రంచు ప‌ట్టు చీర‌లో ప‌ద్ధ‌తైన సాంప్ర‌దాయ యువ‌తిగా మేకోవ‌ర్ చూపించిన తీరుకు కుర్ర‌కారు స‌లాం గులాం అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇంత గొప్ప‌గా ప్ర‌భావితం చేసిన వేరొక బ్యూటీ లేదంటే అతిశ‌యోక్తి కాదు.

దివి సోష‌ల్ మీడియా ఫోటోషూట్లు యూత్ లో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. ఇక మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లో ఎంత హాట్ గా క‌నిపిస్తుందో చీర‌లోనూ అంతే కొంటెగా క‌నిపిస్తోంది అంటూ యూత్ చీర‌లో లుక్ చూశాక‌ కితాబిచ్చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంటి స‌భ్యురాలిగా యువ‌త‌రం మ‌న‌సు దోచిన దివి ప్ర‌స్తుతం మోడ‌ల్ గా న‌టిగా రాణించేందుకు హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో పాపులారిటీ పెంచుకుంది.

ముఖ్యంగా టాలీవుడ్ దృష్టి దివిపైనే ఉందిప్పుడు. త‌న‌కు విరివిగా అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సిద్ధం. రీసెంట్ గానే క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ తోనూ ఆక‌ట్టుకుంది. మ‌రో రెండు సినిమాల‌కు దివి సంత‌కాలు చేసింద‌న్న టాక్ ఉంది.

ఇంత‌లోనే టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ టీవీ స్టార్స్ 2020 జాబితాలో దివి టాప్ ప్లేస్ ని లాక్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అలాగే హైద‌రాబాద్ స్టార్ బ‌జ్ లో డిజైర‌బుల్ స్థానం ప‌రిశీలిస్తే 20వ ర్యాంక్ ని అందుకుంది. అయినా ఈ ర్యాంకుల‌తో సంబంధం లేకుండా దివి సౌంద‌ర్యానికి ముగ్ధులు కానిదెవ‌రు? అందుకేనా ఈ కిరీటం. దివి త‌న‌దైన అందం వాడి వేడితో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. మునుముందు వ‌ర్ధ‌మాన తార‌గా పెద్ద అవ‌కాశాలు అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ ఎర్రంచు ప‌సుపు ప‌ట్టు చీర‌లో దివి అంద‌చందాలు క‌ట్టిప‌డేస్తున్నాయి. ఈ ఫోటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు యూత్.