Begin typing your search above and press return to search.

యాంజెల్ ని త‌ల‌పిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

By:  Tupaki Desk   |   8 Dec 2021 6:30 AM GMT
యాంజెల్ ని త‌ల‌పిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
X
మోడ‌ల్ కం నటి దివి వ‌ద్య‌త బిగ్ బాస్ తో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మెగాబాస్ చిరంజీవి.. కింగ్ నాగార్జున అంత‌టి వారే దివి అందచందాలు ప్ర‌తిభ‌కు ఫిదా అయిపోయి సినీఛాన్సులు ఇస్తామ‌ని అన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. బిగ్ బాస్ బ్యూటీగా ఇప్ప‌టికే బోలెడన్ని అవ‌కాశాల్ని పాతిక ప్రాయం దివి అందుకుంది. హైద‌రాబాద్ నారాయ‌ణ‌మ్మ కాలేజ్ లో ఎంబీఏ పూర్తి చేసిన దివి సింగింగ్.. డ్యాన్సింగ్ లో బెస్ట్ ట్యాలెంట్ గా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మోడ‌ల్ గా రాణిస్తూనే న‌టిగానూ కెరీర్ ని సాగిస్తోంది.

ఆరంభ‌మే సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుంది ఈ బ్యూటీ. `మ‌హ‌ర్షి`లో పూజాహెగ్గే ప్రెండ్ క్యారెక్ట‌ర్ లో న‌టించిన దివి ఆ త‌ర్వాత కొన్ని స‌హాయ‌క‌ పాత్ర‌ల‌తోనూ ఆక‌ట్టుకుంది. అయితే దివిలో న‌టి ఆక‌ట్టుకున్నా.. అంత‌కుమించి ఈ అమ్మ‌డిలో గ్లామ‌ర‌స్ యాంగిల్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.

ఇక బిగ్ బాస్ బ్యూటీ దివికి సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ ఒక రేంజులో ఉంది. హాటెస్ట్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ యూత్ ని దివి హీటెక్కిస్తోంది. ఇప్ప‌టికే ఇన్ స్టా బ్యూటీగా బాగా పాపుల‌ర్ అయింది. నిరంత‌రం కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ల‌తో అభిమానుల‌ను అల‌రించ‌డం త‌న‌కి ఫాలోయింగ్ ని పెంచుతోంది. గ్లామరస్ లుక్ తో పాటు .. ట్రెడిష‌నల్ లుక్ లోనూ దివి ఆక‌ట్టుకుంటోంది.

దివి తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ బ్లౌజ్ కాంబినేష‌న్ లాంగ్ ఫ్రాక్ లో దివి ఎంతో హాట్ గా క‌నిపించింది. అలా ప‌ట్టీల‌తో లాక్ చేసిన బ్యాక్ లెస్ బ్లౌజ్ త‌న హాట్ నెస్ ని ప‌దింత‌లు ఎలివేట్ చేసింది. ఇక దివి న‌డుము అందాలు కుర్ర‌కారును క‌వ్విస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైర‌ల్ గా షేర్ అవుతోంది.

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన దివి నారాయ‌ణ‌మ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఎంబీఏ పూర్తి చేసింది.`బిగ్ బాస్ సీజ‌న్-4 `కంటెంస్టెంట్ గా సంద‌డి చేసిన‌ సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో దివి పెర్ఫామెన్స్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `లెట్స్ గో` అనే చిత్రం దివి తొలి సినిమా. కానీ ఆ సినిమా అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన‌ `మ‌హర్షి`లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర‌తో ఆడియ‌న్స్ కి రీచ్ అయింది. ఇప్పుడిప్పుడే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. సోష‌ల్ మీడియా క్వీన్ గా టాప్ మోడ‌ల్ గా ఆదాయ ఆర్జ‌న బావుంద‌ని తెలిసింది. న‌టిగా కెరీర్ ప‌రంగా కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తోంది. మునుముందు మెగా అక్కినేని కాంపౌండ్స్ నుంచి ఆఫ‌ర్లు ఉంటాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఆ మేర‌కు బిగ్ బాస్ షోలో దివికి చిరు- నాగ్ ప్రామిస్ చేశారు. టాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీ ఎంత వ‌ర‌కూ రాణిస్తుందో చూడాలి.