Begin typing your search above and press return to search.

చిరు మూవీ విషయంలో మురిసి పోతున్న బిబి బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Aug 2021 7:31 AM GMT
చిరు మూవీ విషయంలో మురిసి పోతున్న బిబి బ్యూటీ
X
మెగాస్టార్ చిరంజీవితో ఫొటో దిగితేనే చాలా పెద్ద విషయం.. గొప్ప విషయం అనుకునే వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఇంకా ఏమైనా ఉందా.. వారి కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ అచీవ్మెంట్ అనడంలో సందేహం లేదు. అ కెరీర్‌ బిగ్గెస్ట్‌ ఆఫర్‌ ను బిగ్ బాస్ బ్యూటీ దివి దక్కించుకుంది. చిరంజీవి చేయబోతున్న వేదాళం సినిమా రీమేక్ లో దివికి ఆఫర్‌ దక్కింది. ఏడాది క్రితమే బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వేదిక మీద చిరంజీవి ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. చిరంజీవి  తన సినిమాల్లో ముందు ముందు కూడా దివి ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. దివి అందంను చిరంజీవి ఆ సమయంలో పొగడ్తలతో ముంచెత్తాడు. చిరంజీవి మరియు నాగార్జునలు బిగ్‌ బాస్ వేదిక మీద దివి గురించి చేసిన వ్యాఖ్యల కారణంగానే ఇప్పుకుడ ఆమె కెరీర్‌ దూసుకు పోతుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం సినిమాల.. వెబ్‌ సిరీస్ లు.. కమర్షియల్‌ యాడ్స్ ఇలా పలు రకాలుగా దివి దూసుకు పోతుంది. ఇక వేదాళంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే మేకప్ టెస్ట్‌.. స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేశారంటూ స్వయంగా దివి చెప్పుకొచ్చింది. స్క్రీన్‌ టెస్ట్‌ మరియు మేకప్‌ టెస్ట్‌ సమయంలోనే దివి చాలా ఎగ్జైట్‌ అయినట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్న దివికి చిరంజీవి సినిమాలో చేసే పాత్ర తర్వాత క్రేజ్‌ అమాంతం పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తాజాగా దివి ఒక చిట్‌ చాట్ లో.. బిగ్‌ బాస్‌ స్టేజ్‌ పై చిరంజీవి గారితో మాట్లాడే అవకాశం వచ్చిన సమయంలో చాలా నర్వస్ అయ్యాను. ఆయన తో ఏం మాట్లాడాలి.. ఆయన ఎలా ఉంటారు అనుకున్న సమయంలో ఆయన నా గురించి మాట్లాడిన మాటలు ఎప్పటికి మర్చి పోలేను. ఆయన సినిమాలో నన్ను నటింపజేస్తున్నట్లుగా చెప్పినప్పుడు నోట మాట రాలేదు అన్నట్లుగా దివి చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్‌ కోసం రెడీ అవుతున్నాను.. లుక్ పరంగా పాత్ర పరంగా ఎప్పటికి గుర్తు పెట్టుకునేలా ఉంటుందనే నమ్మకంను కూడా దివి చెప్పుకొచ్చింది. మొత్తానికి చిరంజీవి సినిమాలో నటించబోతున్నందుకు దివి చాలా మురిసి పోతుందని ఆమె వ్యాఖ్యల్లో అర్థం అవుతోంది.