Begin typing your search above and press return to search.

వీడియోః ఇదేం కమర్షియల్‌ యాడ్‌ దివి?

By:  Tupaki Desk   |   28 April 2021 7:30 AM GMT
వీడియోః ఇదేం కమర్షియల్‌ యాడ్‌ దివి?
X
సినిమా ఇండస్ట్రీలో దివి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా జూనియర్ ఆర్టిస్టుగా మాత్రమే ఆఫర్లు వచ్చాయి. కాని బిబి4 తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. బిబికి ముందు కనీసం దివిని గుర్తు పట్టేవారు కాదు. కాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దివి పాప సుపరిచితం. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న దివి హాట్‌ ఫొటోలు వీడియోలు షేర్‌ చేయడంతో పాటు అప్పుడప్పుడు కొన్ని పెయిడ్ పోస్ట్‌ లను కూడా షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా దివి ప్రోటీన్ నాన్‌ వెజ్‌ మార్ట్‌ కు సంబంధించిన ఒక కమర్షియల్‌ యాడ్‌ వీడియోను షేర్‌ చేసింది.

ఆ కమర్షియల్‌ వీడియో ను నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ఆ కమర్షియల్‌ యాడ్‌ ప్రొఫెషనల్‌ గా లేదని ఆ యాడ్‌ లో దివి కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు అంటున్నారు. యాడ్‌ లో దివి ఓవర్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ మరియు పని మనిషితో దివి సాగించిన సంభాషణ ఏమాత్రం సహజంగా లేదంటే వీడియోకు ట్రోల్స్‌ పడుతున్నాయి. బ్రాండ్‌ అంబాసిడర్ గా దివి గతంలో కొన్ని సంస్థలకు చేసింది. కాని ఇంతగా విమర్శల పాలవ్వడం మాత్రం ఇదే ప్రథమం.

దివి కి బిగ్ బాస్ తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. వెబ్‌ సిరీస్ తో పాటు సినిమాల్లో కూడా ఈమెకు ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా లేకుండా ఉంటే ఇప్పటి వరకు దివి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేవి. మెగాస్టార్‌ చిరంజీవి నటించబోతున్న వేదాళం సినిమాలో కూడా దివికి ఆఫర్‌ వచ్చింది. ఇంకా హీరోయిన్ గా కూడా దివికి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. కనుక దివి ముందు ముందు బిజీ నటిగా మారే అవకాశం ఉంది. అంతగా క్రేజ్‌ ఉన్న దివి ఇలాంటి నాసిరకం కమర్షియల్‌ యాడ్ లో నటించడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.