Begin typing your search above and press return to search.
వరంగల్ శ్రీను మునుగుతాడా తేలుతాడా..?
By: Tupaki Desk | 18 Feb 2021 9:00 AM ISTడిస్ట్రిబ్యూట్ వరంగల్ శ్రీను అంటే ఇది వరకు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ ఇటీవల 'క్రాక్' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుపై విమర్శలు చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు 'ఆచార్య' నైజాం ఏరియా రైట్స్ భారీ రేట్ కి తీసుకొని మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు వరంగల్ శ్రీను. మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరత5శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగిందని సమాచారం.
'ఆచార్య' థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేటు పలికాయని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం రైట్స్ భారీ మొత్తానికే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నాడు. దిల్ రాజుతో పోటీపడి మరీ ఈ సినిమా నైజాం హక్కులు 80 కోట్లకు తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ రేటుకి హక్కులు తీసుకున్నాడు.. ఇందులో ఎంత రిటర్న్ అవుతాయో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న 'ఆచార్య' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ అంచనాలను రీచ్ అయితే రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయమనే చెప్పాలి. మరి భారీ రేట్ పెట్టి ఈ మూవీ రైట్స్ తీసుకున్న వరంగల్ శ్రీను మునుగుతాడో తేలుతాడో చూడాలని చర్చించుకుంటున్నారు.