Begin typing your search above and press return to search.

ఆ మూవీపై ఉన్న నెగిటివిటీ ఎఫెక్ట్ ఓటీటీ బ్రాండింగ్ పై పడనుందా...?

By:  Tupaki Desk   |   28 Aug 2020 2:30 AM GMT
ఆ మూవీపై ఉన్న నెగిటివిటీ ఎఫెక్ట్ ఓటీటీ బ్రాండింగ్ పై పడనుందా...?
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రభావం 'సడక్ 2' సినిమాపై గట్టిగానే పడేట్లు కనిపిస్తోంది. సంజయ్‌ దత్‌ - పూజా భట్ - అలియా భట్‌ - ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'సడక్ 2' చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. 1991లో వచ్చిన 'సడక్‌' చిత్రానికి సీక్వెల్‌ గా ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితులు లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల 'సడక్ 2' ట్రైలర్ ని విడుదల చేశారు. అయితే సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ నుంచి వస్తున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. అందుకే 'సడక్ 2' ట్రైలర్ ని అత్యధికమంది డిస్ లైక్స్ కొట్టి వ‌ర‌ల్డ్ లోనే వ‌రస్ట్ ట్రైల‌ర్ గా రికార్డ్ క్రియేట్ చేసేలా చేశారు. ఒక మూవీ ట్రైలర్ కి అన్ని డిస్ లైక్స్ వచ్చాయంటేనే ఈ సినిమాపై ఎంత నెగిటివిటీ ఉందో అర్ధమవుతోంది.

ఇదిలా ఉండగా ఇంతటి నెగిటివిటీ మధ్య రేపు(ఆగస్టు 28) 'సడక్ 2' చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'సడక్ 2' ఎఫెక్ట్ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీపై పడే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'సడక్ 2' సినిమాని ఓటీటీలో చూడొద్దని.. బాయ్ కాట్ చేయాలని.. ఆ సినిమాని ప్రసారం చేసే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ యాప్‌ ను అన్ ఇన్స్టాల్ చేయాలని సుశాంత్ సింగ్ సపోర్టర్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 'సడక్ 2' ని స్ట్రీమింగ్ పెడుతుండటం వల్ల ఇండియాలో సదరు ఓటీటీ బ్రాండింగ్ డ్రాప్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్ ఎక్స్ ప‌ర్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. మరి రేపు 'సడక్ 2' ఓటీటీలో విడుదలైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.