Begin typing your search above and press return to search.
అక్కడ క్రేజ్ తగ్గేసరికి సౌత్ పై మోజుపడుతున్న హీరోయిన్
By: Tupaki Desk | 7 April 2020 9:00 AM ISTదిశా పటాని. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి మళ్లీ కనిపించకుండా వెళ్ళిపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది దిశా. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఎంఎస్ ధోని, బాఘీ సినిమాలు హిట్ అవ్వడంతో అమ్మడి కెరీర్ అక్కడే అనుకోని ఇంతకాలం ఫిక్స్ అయింది. ఇక బాఘీ సినిమా తర్వాత టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ లో ఉన్నట్లు కూడా భామ వార్తల్లో నిలిచింది. డేటింగ్ పై టైగర్ ష్రాఫ్ నోరు మెదపకపోవడంతో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టింది. అనంతరం నటించిన బాఘీ2, కుంగ్ ఫు యోగ, భారత్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఈ దెబ్బతో మళ్లీ అమ్మడు రీసెంట్ గా ఆషీకీ2, ఏక్ విలన్ సినిమాల డైరెక్టర్ శేఖర్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కిన 'మలాంగ్' సినిమాతో ఈ ఏడాదిని ప్రారంభించింది.
కానీ మలాంగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలాంగ్ సినిమా ప్లాప్ అవడంతో దిశాకు బాలీవుడ్ నుండి అవకాశాలు రావడం తగ్గిపోయింది. చేతిలో ఒక్క సినిమా కూడా లేక అమ్మడు అల్లాడిపోతోందట. లోఫర్ సినిమా టైంలో అమ్మడికి తెలుగు నుండి బాగానే ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్ లో రెండు హిట్లు పడేసరికి ఈ హాట్ బ్యూటీ పారితోషికం భారీగా పెంచేసిందట. ప్రస్తుతం అవకాశాలు లేక హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కించే పనిలో పడింది. తాజాగా అమ్మడు టాలీవుడ్ నుండి అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతుందట. బాలీవుడ్ లో మంచి ఫామ్ ఉన్నప్పుడు కనీసం సౌత్ పై కన్ను వేయని దిశా ప్రస్తుతం అక్కడ అవకాశాలు లేక సౌత్ ఇండస్ట్రీపై తెగ ప్రేమను ఒలకబోస్తుందట. అంత గమనిస్తూనే ఉన్నాం.. అనుకుంటున్నారట సౌత్ దర్శక నిర్మాతలు.