Begin typing your search above and press return to search.

ఆటోరాణిగా ముంబై వీధుల్లో సీకే బ్యూటీ హ‌ల్చ‌ల్

By:  Tupaki Desk   |   9 Jan 2021 8:30 AM IST
ఆటోరాణిగా ముంబై వీధుల్లో సీకే బ్యూటీ హ‌ల్చ‌ల్
X
ప‌బ్లిక్ ని హీటెక్కించ‌డం .. టీజ్ చేయ‌డంలో సీకే బ్యూటీ దిశాప‌టానీ త‌ర్వాతే ఎవ‌రైనా. ఈ అమ్మ‌డి ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ నిరంత‌రం యువ‌త‌రంలో హాట్ టాపిక్. జిమ్ కి వెళ్లినా.. షాపింగ్ కి వెళ్లినా.. లేదా వీధుల్లో షికార్ కి వెళ్లినా దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ లుక్ కి క‌ళ్ల‌న్నీ అటువైపే ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

బాలీవుడ్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడ్ర‌నైజ్డ్ యంగ్ బ్యూటీగా నిరంత‌రం మీడియాని యంగేజ్ చేయ‌డం త‌న స్టైల్‌. ఇప్ప‌టికే దిశా ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ పై ర‌క‌ర‌కాల ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఈ భామ ముంబై న‌గ‌రంలో ఆటో రైడ్ కి వెళ్లిన ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీలా మారాయి. టాప్ టు బాట‌మ్ సింపుల్ బ్లాక్ ట్రాక్ లో క‌నిపించింది దిశా. బ్లాక్ క‌ల‌ర్ మాస్క్ ని ధ‌రించింది. బ్లాక్ ఫ్రంట్-జిప్ టాప్ - మ్యాచింగ్ జాగర్స్ .. వైట్ స్నీకర్స్ తో బ్లాక్ లో దిశా లుక్ ఆక‌ట్టుకుంది.

దిషా ఇలా ఆలోలోనే ఎందుకు వెళ్లింది? అంటే.. తన కారులో ప్రయాణించే బదులు ఆటో రైడ్ కి వెళ్లాల‌ని భావించింద‌ట‌. ఇక త‌న‌తో పాటే ఫోటోగ్రాఫ‌ర్ల బృందం త‌న‌ని క‌వ‌ర్ చేస్తూ ఆటోని వెంబ‌డించార‌ట‌.

కెరీర్ సంగ‌తి చూస్తే.. దిషా పటాని చివరిసారిగా`మ‌ళంగ్` అనే చిత్రంలో న‌టించింది. ఆదిత్య రాయ్ కపూర్ - అనిల్ కపూర్ - కునాల్ ఖీము ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `రాధే`లో న‌టించింది. ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఏక్తా కపూర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న‌ `కెటినా`లో కూడా దిశా కనిపిస్తుంది. మోహిత్ సూరి ఏక్ విలన్ సీక్వెల్ లో జాన్ అబ్రహం - తారా సుతారియా తో క‌లిసి న‌టిస్తోంది.