Begin typing your search above and press return to search.

ఆ సాంగును వాడుకుంటున్న దిశా

By:  Tupaki Desk   |   31 Jan 2018 7:04 AM GMT
ఆ సాంగును వాడుకుంటున్న దిశా
X
కొంతమంది స్టార్స్ ఎన్ని సినిమాల్లో నటించినా సరైన హిట్ పడేంత వరకు కెరీర్ సెట్ కాలేదు అనే భావనతోనే ఉంటారు. అయితే అదృష్టం బావుండీ ఒక్క సినిమాలో మెప్పించే గలిగితే ఇక వారి దశ తీరిగినట్టే. బాలీవుడ్ లో మాధురి దీక్షిత్ అప్పట్లో తన స్టెప్పులతో నటనతో అందరిని ఎంతగానో మెప్పించేది. మొదట్లో ఆమె కూడా సరైన సక్సెస్ కోసం చాలా కష్టపడింది. అయితే ఒకే ఒక్క సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. ముఖ్యంగా ఆ సినిమాలో పాట వల్ల చాలా ఫెమస్ అయిపొయింది.

1988లో వచ్చిన తేజబ్ సినిమా అప్పట్లో ఒక సన్సేషన్. అందులో ఏక్ ధో తీన్ అనే సాంగ్ సంచలనం సృష్టించింది. భాషాబేధం లేకుండా వరల్డ్ వైడ్ గా ఆ సాంగ్ హిట్ అయ్యింది. ఇప్పటికి కూడా ఆ సాంగ్ ఎదో ఒక వేడుకల్లో వినిపిస్తూనే ఉంటుంది. అనిల్ కపూర్ హీరోగా చేసిన ఆ సినిమాకి లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతాన్ని అందించారు. అయితే మాధురి దీక్షిత్ లైఫ్ చేంజ్ సాంగ్ ను మరోక యువ నటి కూడా వాడుకోబోతోంది.

హాట్ బ్యూటీ దిశా పటాని గత కొంత కాలంగా కెరీర్ ను సెట్ చేసుకోలేక సతమతమవుతోంది. అయితే ఆమె చేయబోయే భాగీ 2 సినిమాలో చిత్ర యూనిట్ ఏక్ ధో తీన్ సాంగ్ ని రీమిక్స్ చేయాలనీ చూస్తున్నారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తోన్న ఆ సినిమా తెలుగు సినిమా క్షణంకు రీమేక్ గా వస్తోంది. టైగర్ ష్రాఫ్ స్టైల్ కి తగ్గట్టుగా కథలో చాలా వరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక దిశా పటాని ఈ సినిమాతో అయినా కెరీర్ ను ఒక ట్రాక్ లో సెట్ చేసుకుంటుందో లేదో చూడాలి.