Begin typing your search above and press return to search.

నెట్టింట దిశ థై థండ‌ర్ షోస్ వైర‌ల్

By:  Tupaki Desk   |   15 Nov 2021 11:09 AM GMT
నెట్టింట దిశ థై థండ‌ర్ షోస్ వైర‌ల్
X
`లోఫ‌ర్` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన దిశాప‌టానీ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మాత్ర‌మే న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో అమ్మ‌డికి తొలి సినిమా చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టినా..డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి ప‌ని చేసినా త‌న‌కు ఇక్క‌డ క‌లిసి రాలేదు. అటుపై అవ‌కాశాలొచ్చినా తెలుగులో న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేద‌ని టాక్ వినిపించింది. అయితే బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయింది దిశ‌. ఎం.ఎస్. ధోనీ బ‌యోపిక్ తో పాటు..`కుంగ్ ఫూ యోగా`..`వెల్క‌మ్ న్యూయార్క్`..`భాఘీ-3 `చిత్రాల్లో న‌టించి బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుంది. దీంతో దిశ కెరీర్ బాలీవుడ్ లో తిరుగు లేకుండా సాగిపోతోంది. ప్ర‌స్తుతం చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.

ఇలా సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా దిశా సోష‌ల్ మీడియాల్లో అంత‌కుమించి యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ ఫోటోషూట్ల‌తో కాక‌లు పుట్టించ‌డం దిశ ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా చాలా సంద‌ర్భాల్లో అందాలు ఆర‌బోసిన ఈ ముంబై బ్యూటీ మ‌రోసారి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగిపోయింది. అయితే ఈ సారి కాస్త ట్రెడీష‌న‌ల్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది . థై అందాలు ఎలివేట్ అయ్యేలా చిట్టి పొట్టి గౌను ధ‌రించింది.

అంద‌మైన కురుల‌ను అలా గాలికి వ‌దిలేసి సాగ‌ర తీరాన స‌ముద్ర అలల స‌వ్వడిలో సంద‌డి చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. దిశ అనుచ‌ర గ‌ణ త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం హిందీలో `టీనా`.. `ఏక్ విల‌న్ రిట‌ర్న్స్` లో న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.