Begin typing your search above and press return to search.

లోఫర్ పాపకి హాలీవుడ్ ఛాన్స్

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:30 PM GMT
లోఫర్ పాపకి హాలీవుడ్ ఛాన్స్
X
లోఫర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన దిశా పటానీకి.. ఇక్కడ అంతగా కలిసొచ్చిందేమీ లేదు. పూరీ సినిమాలో హీరోయిన్ గా పరిచయమైతే.. సాధారణంగా హీరోయిన్లకు ఆఫర్లు తన్నుకొస్తాయి. కానీ దిశా పటానీకి అంతగా ఒరిగిందేమీ లేదు.

లోఫర్ తో క్రేజ్ బాగానే సంపాదించింది దిశా పటానీ. ఎంక్వైరీలు కూడా బోలెడు వచ్చాయి. అయితే సినిమా ఫెయిల్యూర్ కారణంగా ఇవేవీ ప్రాజెక్టుగా మారలేదు. కానీ.. ఇప్పుడు దిశాకి ఓ బంపర్ వచ్చింది. అది కూడా హాలీవుడ్ మూవీలో ఛాన్స్ పట్టేసింది. రీసెంట్ గా ఇండియన్ నటీ నటులను తెగ ఇష్టపడుతున్న హాలీవుడ్ స్టార్ జాకీచాన్ మూవీలో దిశ పటానీకి ఆఫర్ వచ్చింది. ఇప్పటికో సోనూసూద్ తో పాటు మరో ఇండియన్ భామ ధనుష్ అనేకుడు పేం అమైరా దస్తూర్ తన మూవీ కుంగ్ ఫూ యోగా లోకి తీసుకున్నాడు జాకీ చాన్. ఇప్పుడు మరో పాత్ర కోసం దిశాపటానీని అడిగింది యూనిట్.

జాకీచాన్ తో కలిసి తీయించుకున్న ఫోటోను.. ఆ హీరోపై మాత్రం మాస్క్ లా చిత్రీకరించి పోస్ట్ చేసింది లోఫర్ పాప. అయితే.. అక్కడున్నది జాకీచాన్ అనే విషయం మాత్రం అందరికీ తేలిగ్గానే అర్ధమవుతోంది. కుంగ్ ఫూ యోగాలో అని చెప్పకుండా.. తను ఓ హాలీవుడ్ సినిమాలో భాగం అని చెప్పింది. అయితే.. దిశా ఇచ్చిన కుంగ్ ఫూ పోజ్ చూస్తే.. అది కుంగ్ ఫూ యోగాలో ఓ ప్రాక్టీస్ అని తేలిగ్గానే అర్ధమవుతోంది. మొత్తానికి లోఫర్ బేబీకి బంపర్ ఆఫర్ బాగానే వచ్చింది.