Begin typing your search above and press return to search.

డాషింగ్ డైరెక్టర్ ను అప్సెట్ చేసిన హాటు పాప!

By:  Tupaki Desk   |   3 March 2020 7:00 AM GMT
డాషింగ్ డైరెక్టర్ ను అప్సెట్ చేసిన హాటు పాప!
X
దిశా పటాని ఇప్పుడంటే హాటు భామగా పేరు తెచ్చుకుంది.. కాల్విన్ క్లెయిన్ ను హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేసింది. ఇన్నర్ వేర్ బ్రాండ్ అంబాజిడర్లకు క్రేజ్ తీసుకొచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ గా సెట్ అయింది కానీ ఈ భామలోని స్పార్క్ ను గుర్తించిన ఘనుడు ఎవరో కాదు.. మోడరన్ దర్శకేంద్రుడు.. మన పూరి జగన్నాధుడే!

దిశా పటానికి 'లోఫర్' సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించక పోవడంతో దిశా పటాని తన దృష్టిని బాలీవుడ్ పైకి మరల్చింది. అక్కడ వరసగా ఆఫర్లు రావడంతో సెట్ అయి పోయింది. ఇదిలా ఉంటే ఈమధ్య ఈ హాటు బ్యూటీ పూరికే 'నో' చెప్పిందట. పూరి ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మొదట దిశా పటానిని హీరోయిన్ గా అనుకున్నారట. అయితే దిశా మాత్రం సింపుల్ గా 'నో' చెప్పేసిందట. ప్రస్తుతం ఈ భామ దృష్టి అంతా హిందీ సినిమాలపైనే ఉందట. అందుకే ఈ టాలీవుడ్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదట.

దిశా నో చెప్పడంతో పూరి కొంతమేర అప్సెట్ అయ్యారట. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని ఫిక్స్ అయి ఉండడంతో మరో న్యూ జెనరేషన్ హీరోయిన్ అనన్య పాండేని ఫైనలైజ్ చేశారని ముంబై మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయినా హాటు పటాని పాప ఇలా మన డాషింగ్ డైరెక్టర్- రౌడీ హీరో సినిమాను రిజెక్ట్ చెయ్యడం ఏం బాగాలేదబ్బా.. అభిమానులు చాలా మిస్ అవుతారు. వారి హాటు మనోభావాలు దెబ్బతింటాయి కదా!