Begin typing your search above and press return to search.

ఈ ఫోటోలయినా దశ మారుస్తాయో లేదో

By:  Tupaki Desk   |   24 Feb 2016 1:30 PM GMT
ఈ ఫోటోలయినా దశ మారుస్తాయో లేదో
X
లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది దిశా పటానీ. ఆ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే వరకూ.. గుట్టుగా ఉన్న ఈ భామ తర్వాత మాత్రం తెగ రెచ్చిపోయింది. ఆడియో ఫంక్షన్ లోనే అదిరిపోయే డ్యాన్సులతో టాలీవుడ్ ని ఆకర్షించింది. ఇక సినిమాలో పారిజాతంగా మంచి పాత్రనే పోషించింది. దిశ రోల్ కి గుర్తింపు వచ్చినా... లోపర్ మూవీ మాత్రం ఫెయిల్ అయింది. దీంతో లోఫర్‌ తరువాత తెలుగులో ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు.

అందరూ అప్పుడేమో ఇలియానాలా ఉంది అంటూ ఆకాశానికి ఎత్తేశారు. డ్యాన్సింగ్ ట్యాలెంట్ కూడా కత్తిలా ఉందని పొగిడారు. పూరీ హీరోయిన్ అంటే ఇక టాప్ లోకి ఎంట్రీ ఖాయం అన్నారు. కానీ.. లోఫర్ ఫ్లాపయ్యాక ఇలియానాను పక్కనెట్టేసినట్లే ఈమెను కూడా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఈ అమ్మడు హాలీవుడ్ లో ఓ ఛాన్స్ పట్టేసింది. కుంగ్ ఫూ యోగ మూవీలో జాకీచాన్ సరసన ఓ రోల్ చేస్తోంది. ఓ ఆర్కియాలజీ ప్రొఫెసర్ గా ఆ చిత్రంలో నటిస్తున్నా.. ఈమెకు ఇంకా తెలుగులో సత్తా చాటాలనే కోరిక మాత్రం తీరలేదు. అందుకే ఈ అమ్మడు తన ఫోటో షూట్‌ ఇక్కడు పంపుతోంది.

స్పెషల్ ఔట్ ఫిట్స్ తో.. ప్రత్యేకంగా తీయించుకున్న ఫోటోషూట్ లను తెగ షేర్ చేస్తోంది. స్పెషల్ గా టాలీవుడ్ గా జనాలకే వీటిని పంపుతోందంటే.. టాలీవుడ్ పై దిశాకి ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ ఫోటోలైనా దిశకి దశ మారుస్తాయేమో చూడాలి. ఫిలిం మేకర్లూ.. కరుణించి ఇప్పటికైనా ఆఫర్లు ఇస్తారా?