Begin typing your search above and press return to search.

నన్ను నాలాగే గుర్తిస్తే సంతోషిస్తా

By:  Tupaki Desk   |   16 Dec 2015 9:30 AM GMT
నన్ను నాలాగే గుర్తిస్తే సంతోషిస్తా
X
దిశా పటాని.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన లోఫర్ తో అరంగేట్రం చేస్తోంది. ఆడియో ఫంక్షన్ లో అదిరిపోయే మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న దిశా పటాని పై.. ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. హీరోయిన్స్ విషయంలో లేటెస్ట్ సెన్సేషన్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. వీటికి తగినంతగా అమ్మడి దగ్గర చాలా ట్యాలెంట్ కూడా ఉందన్నది లోఫర్ యూనిట్ మాట.

తన లాంఛింగ్ మూవీకోసం తెగ ప్రచారం చేసేస్తున్న ఈ భామకు.. బోలెడన్ని కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని ఏంటంటే.. లుక్కు విషయంలో బక్క భామ ఇలియానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ల మాదిరిగా ఈ దిశా పటాని కూడా ఉందని. ఇంకా ఒఖ మూవీ కూడా రిలీజ్ కాకముందే సీనియర్ బ్యూటీలతో పోల్చేసే సరికి ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది లోఫర్ పాప. అయితే ఇలా పోల్చి చూస్తుండడం బాగానే ఉంది కానీ.. తనను తనలా గుర్తిస్తే ఇంకా సంతోషిస్తానని చెబుతోంది. అది కూడా కరెక్టే కానీ.. అసలు దిశా పటాని ని ఇండివిడ్యువల్ గా చూడాలంటే.. కనీసం రెండుమూడు సినిమాలైనా రిలీజ్ కావాలి. యాక్టింగ్ విషయంలో ఎలా చేస్తోందో ప్రూవ్ చేసుకోవాలి. కాసింత మంది ఫ్యాన్స్ నైనా మైమరపించగలగాలి.

అవేమీ లేకుండా ఎవరితో పోల్చకుండా.. ఇండివిడ్యువల్ గా గుర్తించడం ఎలా సాధ్యమో అర్ధం కాని విషయం. ఇలాంటి క్లాసులు కెరీర్ కాస్త ఊపందుకున్నాక చెబ్తే బాగానే ఉంటాయ్ కానీ.. ఆరంభంలోనే జనాలకు క్లాసులు పీకేస్తే.. తర్వాత అనవసరమైన కామెంట్స్ చేశామని జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైతే ఈమె ఎంతగా మొత్తుకున్నా..జనాలు మాత్రం ఇలియానాలా ఉందే అనే అనుకుంటున్నారు.