Begin typing your search above and press return to search.

పాప కోసం ఫోన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   19 Dec 2015 9:40 AM GMT
పాప కోసం ఫోన్ చేస్తున్నారు
X
వరుణ్ తేజ్ తో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన మూవీ లోఫర్.. మిక్సెడ్ టాక్ తోనే థియేటర్లలో నడుస్తోంది. అయితే.. సోలో రిలీజ్ కావడంతో.. కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా హీరో కేరక్టరైజేషన్ కి, హీరోయిన్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. లోఫర్ హీరోయిన్ దిశా పటానీకి ప్రచారం లేట్ గా మొదలైంది. జస్ట్ ఆడియో ఫంక్షన్ ముందురోజు నుంచే ఈ భామ లైమ్ లైట్ లోకి వచ్చింది.

అంటే ఇప్పటికి 10 రోజుల నుంచి మాత్రమే మీడియాకి, మిగతా జనాలతో మాట్లాడుతోందన్న మాట. అయినా.. సరే అరంగేట్రంలోనే అదరగొట్టేసింది దిశా. సినిమా రిలీజ్ కి ముందే ఆడియో ఫంక్షన్ లో తన సత్తా ఏంటో చాటింది. నాటు డ్యాన్సులను కూడా కుమ్మేయడంతో.. ఈ పిల్ల ఫ్యూచర్ బోలెడు ఉందని అప్పుడే అంచనాలు వేసుకున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పుడు లోఫర్ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ పూరీ కూడా ఇదే సంగతి చెబ్తున్నాడు. "హీరోయిన్‌ దిశా పటానీ కోసం ప్రొడ్యూసర్లు నాకు ఫోన్లు చేస్తున్నారు. అంతమంది పోన్లు చేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద హీరోయిన్‌ అయిపోయినట్లే."అన్నాడు పూరీ. యాక్టింగ్ విషయంలో మార్కులు తక్కువగానే పడినా.. డ్యాన్సులు, రొమాన్స్. అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గలేది దిశా పటానీ.

పాటల్లో అయితే ఎలాంటి మొహమాటాలు లేకుండా వయ్యారాలు ఒలకబోసేసింది. దీంతో ఈ ఇంపోర్ట్ పిల్లకు ఇండస్ట్రీలో క్రేజ్ బాగానే పెరుగుతోంది. దీనికి తోడు పూరీ హీరోయిన్లకు పరిశ్రమలో క్రేజ్ ముందునుంచే ఉంది. ఇప్పుడు జనాల నుంచి కూడా దిశాకు క్రేజ్ రావడంతో... తమ సినిమాలో ఒప్పించేందుకు డైరెక్టర్స్ - ప్రొడ్యూసర్స్ బాగానే ట్రై చేస్తున్నారు. జాగ్రత్తగా కాసిని మంచి ప్రాజెక్ట్స్ లో కనిపించిందంటే మాత్రం.. దిశా పటానీకి దశ తిరిగినట్లే.