Begin typing your search above and press return to search.

లోఫర్ చిన్నది కనిపిస్తే చమక్కులే

By:  Tupaki Desk   |   17 Dec 2015 4:00 AM IST
లోఫర్ చిన్నది కనిపిస్తే చమక్కులే
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నట్లు ఈ ఏడాది జూన్ లో ప్రకటించాడు పూరీ జగన్నాధ్. ఆ తర్వాత నెల రోజుల లోపే షూటింగ్ స్టార్ట్ చేసేశాడు కూడా. వరుణ్ సరసన హీరోయిన్ గా ఎంపికయ్యి, మెగా క్యాంప్ లో అడుగు పెట్టింది దిశా పటాని .

అయితే ఆరు నెలల కాలంలో అమ్మడి పేరు - ఫోటోలు తప్ప.. ఎక్కడా అమ్మాయి మాత్రం కనిపించలేదు. లోఫర్ ఆడియో వేడుకకు ముందు రోజు నుంచే ఈ చిన్నది మీడియా ముందుకు రావడం మొదలుపెట్టింది. ఇప్పటికి నాలుగంటే నాలుగు సార్లు ఫోటోలకు ఫోజులిచ్చింది. కొత్త హీరోయిన్ కావడంతో కాసింత సిగ్గు పడుతుందేమో అనుకోవచ్చు కానీ.. దిశా పటాని కి అలాంటి మొహమాటాలు ఏమీ లేవని ఇప్పటికే తెలిసిపోయింది.

ఓ సారి ఫుల్లు వైట్ డ్రస్ లో కనిపించినా.. లోపలి దుస్తులు కనిపించేలా డ్రసింగ్ చేసుకొచ్చి చూపరులను రెచ్చగొట్టేసింది. మరోసారి మెరూన్ కలర్ స్లీవ్ లెస్ మిడ్డీలో తొడల వరకూ ప్రదర్శనకు పెట్టేసింది. ఇంకో సారి నాభి అందాలను చూసుకోమంటూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. మరోసారి జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చినా.. టాప్ మాత్రం టాప్ లెస్ కి దగ్గరగా వేసుకొచ్చింది. ఇలా కనిపించిన ప్రతీసారి ఒక్కో స్టైల్ తో ఇరగదీసేసి, ట్రెండ్ కి కేరాఫ్ అడ్రస్ లా అనిపిస్తోంది ఈ భామ. పబ్లిసిటీలోనే ఇన్ని రకాలు చూపిస్తే.. ఇక సినిమాలో ఇంకెన్ని అందాలు ఆరబోసిందో ?