Begin typing your search above and press return to search.

పటానీకి పటాయించడం బాగానే తెలుసు

By:  Tupaki Desk   |   7 Dec 2015 9:30 AM GMT
పటానీకి పటాయించడం బాగానే తెలుసు
X
ఈ తరం హీరోయిన్లకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిపోతోంది. కాసింత పేరొచ్చాక గ్లామర్ చూపించి ఎరవేసే రోజులు పోయాయి. ఇంట్రడక్షన్ నుంచి ఇరగదీసేయడం మొదలుపెట్టారు. రీసెంట్ గా పూరీ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న దిశాపటానీ వాలకం చూస్తే ఈ విషయం ప్రూవ్ అవుతుంది.

మెగా వారసుడు వరుణ్ తేజ్ నటిస్తున్న లోఫర్ తో తెలుగు సినీరంగ ప్రవేశం చేస్తోంది దిశా పటానీ. ఈ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నారన్న మాటే కానీ.. ఇప్పటివరకూ బయటెక్కడా పెద్దగా కనిపించలేదు ఈ భామ. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడ్డం, ఆడియో ఫంక్షన్ కి సిద్ధమవడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రేడియో సిటీలో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు యూనిట్.

ప్రచారంలో భాగంగా తొలి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది దిశాపటానీ. కుర్రకారును పటాయించేందుకు వీలుగా చూపించాల్సినవి చూపిస్తూ డ్రెసింగ్ చేసుకొచ్చేసింది. తను ఎలా ఉంటే, ఎలా కనిపిస్తే.. ప్రచారంలో తనకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందే బాగానే వంటబట్టించుకుంది. అందుకే.. తొలి ముఖాముఖి కార్యక్రమానికే నాభి అందాలను తెగ ప్రదర్శించేసింది. ఫోటోలకు వయ్యారంగా పోజలిచ్చింది. బయటే ఇలా ఉంటే.. ఇక సినిమాలో పూరీ ఏ రేంజ్ లో చూపించి ఉంటాడో అనుకుంటున్నారు జనాలు.