Begin typing your search above and press return to search.

టైగ‌ర్ ని వ‌దిలేసి ప‌ప్పీతో స్నేహమా!

By:  Tupaki Desk   |   13 Feb 2020 3:45 PM IST
టైగ‌ర్ ని వ‌దిలేసి ప‌ప్పీతో స్నేహమా!
X
స‌రిగ్గా ఏడాది క్రితం ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ కి బ్రేక‌ప్ చెప్పేసింది దిశా ప‌టానీ. అప్ప‌టి నుంచి సోలో లైఫ్ నే లీడ్ చేస్తోంది. అయితే ఇలానే ఒంట‌రిత‌నాన్ని భ‌రించడం ఎలా? అందుకే.. ఇదిగో ఆల్ట‌ర్నేట్ ఫ్రెండుని సెట్ చేసుకుంది. ఇంత‌కీ ఎవ‌రీ ఫ్రెండు? అంటే.. ఇంకెవ‌రూ త‌న మ‌న‌సుకు ఎంతో బాగా దగ్గ‌రైన ప‌ప్పీ ఫ్రెండు. ప్ర‌తిసారీ తాను ఎక్క‌డికి వెళ్లినా త‌న వెంటే వ‌చ్చేందుకు ఆసక్తి చూపిస్తుంద‌ట ఈ పెట్ డాగ్. అందుకే వీలున్న‌ప్పుడ‌ల్లా దిశా స్వ‌యంగా ఆరుబ‌య‌ట షికారుకి తిప్పుతుంటుంది. అలా ముంబైలో ఓ షాపుకి వెళ్లింది దిశా. అక్క‌డ త‌న‌పై కెమెరా ఫ్లాష్‌ లు మెరిశాయి.

బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. శిల్పా శెట్టి లాంటి తార‌లకు పెట్స్ అంటే ఎంతో ఇష్టం. వాటిని ఎంతో ప్రేమ‌తో పెంచి పోషిస్తుంటారు. వారి బాట‌లోనే దిశా పటాని జంతు ప్రేమికురాలు. పెట్స్ తో ఎంతో స్నేహంగా ప్రేమ‌గా ఉంటుంది. దిశా ఇంట్లో రెండు కుక్క పిల్ల‌ల‌తో పాటు పిల్లి కూడా ఉంది. వాటికి సంబంధించిన‌ ఫోటోలను రెగ్యుల‌ర్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానుల‌కు షేర్ చేస్తుంటుంది. ప్రియాంక చోప్రా జోనాస్ స్ఫూర్తితో దిశా ప‌టానీ కూడా తన పెంపుడు జంతువుల కోసం ఒక ప్రత్యేక ఇన్ స్టాగ్రామ్ ఖాతాను తెరిచి.. అందులో వాటి ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ప్ర‌తి గ్రేట్ మూవ్ మెంట్ ని ఇక్క‌డ షేర్ చేసుకుంటోంది.

బుధవారం నాడు.. దిషా తన పెంపుడు కుక్క తో షాపింగ్ కి వెళ్లిన‌ప్పుడు త‌న‌పై ఫ్లాష్ లు మెరిశాయి. దిశా ఆ స‌మ‌యంలో వైట్ డిజైన‌ర్ స్కర్ట్ తో త‌ళుక్కున మెరిసింది. పెంపుడు కుక్కతో తన కారు వైపు వెళుతుంటే అది ఎంతో ఉత్సాహంగా ఉర‌క‌లెత్తుతూ ప‌క్క‌కు లాక్కెళ్లింది. ఇంకా ఇంటికి వెళ్ళడం త‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేన‌ట్టుగా.. గార్డెన్ వైపు లాక్కెళ్ల‌బోయింది. ఆ ల‌వ్ లీ ప‌ప్పీ యాక్టివిటీస్ కి దిశా న‌వ్వులు చిందిస్తుంటే స్నాప్ లు త‌ళుక్కున మెరిశాయి.

ఇక దిశా ప‌టానీ కెరీర్ సంగ‌తులు ప‌రిశీలిస్తే.. ఇటీవల విడుదలైన `మళంగ్` బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. త‌దుప‌రి సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న‌ నటిస్తున్న `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్`.. `కెటినా... చిత్రాలు సెట్స్ లో ఉన్నాయి. బాఘి 3 లోని ఒక ప్రత్యేక గీతంలో న‌ర్తించింది. ఈద్ 2020 కానుక‌గా రాధే రిలీజ్ కి రానుంది.