Begin typing your search above and press return to search.

`మూడ్` అంటూ హీట్ పెంచిన దిశా

By:  Tupaki Desk   |   5 April 2021 9:30 AM GMT
`మూడ్` అంటూ హీట్ పెంచిన దిశా
X
స‌మ్మ‌ర్ లో ఎవ‌రి మూడ్ ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఓవైపు సూర్య‌తాపానికి త‌ట్టుకోలేక‌ చాలా మంది మాల్దీవులకు గోవాకు వెళ్లే మూడ్ లో ఉన్నారు. కొంద‌రు మంచు కొండ‌ల్లో ఒంట‌రిగా స్పెండ్ చేసేందుకు ప్లాన్ లో ఉన్నారు. చాలా మంది స్విమ్మింగ్ పూల్స్ బీచ్ సైడ్ పూల్ ట్రీట్ మెంట్ కోసం రిసార్ట్ వెకేష‌న్స్ కోసం ప్లానింగులో ఉన్నారు.

ఇలాంటి వాటికి నేను సైతం అంటూ రేసులో ముందుండే దిశా ప‌టానీ ఈసారి ఏం చేసిందంటే.. స‌మ్మ‌ర్ లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మై షాకిచ్చింది. ఒంటిపై ఆచ్ఛాద‌న ఎంత త‌క్కువ ఉంటే అంత మంచిదనేది ఈ అమ్మ‌డి ఫిలాస‌ఫీ. అందుకు త‌గ్గ‌ట్టే చిట్టి పొట్టి దుస్తుల్లోనే ప్ర‌త్య‌క్ష‌మైంది. అలా బ్లూ డెనిమ్ లో బ్యాక్ లెస్ ఫోజుల‌తో చెల‌రేగింది. పిక్క‌ల‌పైకి పొట్టి దుస్తుల‌తో హీట్ పెంచింది.

ఫిట్ ‌నెస్ ఫ్రీక్ దిషా పటాని తన మనోభావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. `మూడ్` అన్న ట్యాగ్ లైన్ తో దిషా రెండు ఫోటోల‌ను ఇన్ ‌స్టాలో షేర్ చేయ‌గా..అవి వైర‌ల్ గా మారాయి. `ఈ మూడ్ ని ప్రేమించండి` అంటూ దీనికి ఎల్లీ అవ్ రామ్ స్పందించ‌డం ఆస‌క్తిక‌రం.

దిశా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్ అబ్రహం తో కలిసి `ఏక్ విలన్ రిటర్న్స్` షూటింగ్ లో పాల్గొంటోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్`.. రిలీజ్ కావాల్సి ఉంది. ఏక్తా కపూర్ నాయికా ప్ర‌ధాన చిత్రం `కెటినా`లోనూ దిశా నాయిక‌గా న‌టించింది. టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌నా ఓ చిత్రంలో దిశా న‌టించ‌నుంది.