Begin typing your search above and press return to search.

#CK శివంగి.. ఫ్రెండు పెళ్లిలో గుండెలు దోచిన బంటు!

By:  Tupaki Desk   |   18 Feb 2021 2:00 PM IST
#CK శివంగి.. ఫ్రెండు పెళ్లిలో గుండెలు దోచిన బంటు!
X
దిశా పటాని ప్రస్తుతం తన స్నేహితుడి వివాహం నుంచి మ‌ర‌పురాని జ్ఞాపకాల్ని అభిమానుల‌కు షేర్ చేయ‌డం హీటెక్కిస్తోంది. నేడు తన ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో పెళ్లి వేడుక‌ల‌ నుంచి అనేక ఫోటోల్ని షేర్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతున్నాయి. వ్వావ్ అద్భుతం అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అంత‌గా దిశా లుక్ క‌ట్టి ప‌డేస్తోందా? అంటే ఈ ఫోటోలే అందుకు సాక్ష్యం. బ్లూ లెహెంగా ధరించి మిర్రర్ సెల్ఫీలు ఫోటోల‌ కోసం పోజులిస్తోంది దిశా. జువెల‌రీ సెట‌ప్ స‌హా దిషా పటాని కేశాలంకరణ ఎంతో ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకున్నాయి. ఆస్థా శర్మ త‌న‌కు స్టైలింగ్ చేశార‌ట‌. సీకే బ్యూటీ దిషా న‌యా కొత్త లుక్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఫోటోల‌పై ఎక్స్ ప్రియుడు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు.``హెయిర్ ఆన్ పాయింట్.. మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాం..`` అని వ్యాఖ్యానించ‌గా.. దిషా సోదరి ఖుష్బూ పటాని ``ఎప్పటిలాగే చాలా అందంగా ఉంది బెహ్నా`` అంటూ వ్యాఖ్యానించింది. అమేజింగ్ లుక్,... సూపర్ క్యూట్ అంటూ అభిమానులు ఫిదా అయిపోయారు.

దిశా ప్ర‌స్తుతం రాధే చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ మూవీ ఈద్ కానుక‌గా రిలీజ్ కానుంది. మ‌ళంగ్ ద‌ర్శ‌కుడితోనూ ఓ సినిమా చేస్తోంది. వీట‌న్నిటినీ మించి కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న స‌లార్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌న్న ప్ర‌చారం డైహార్డ్ ఫ్యాన్స్ లో అగ్గి రాజేస్తోంది.