Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః బికినీ బాడీ అంటే ఈ హీరోయిన్నే!

By:  Tupaki Desk   |   15 April 2021 11:30 AM GMT
ఫొటోటాక్‌ః బికినీ బాడీ అంటే ఈ హీరోయిన్నే!
X
హీరోయిన్‌ గా తెలుగులో పరిచయం అయ్యి ఆ తర్వాత ముంబయి లో మస్త్‌ బిజీ అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ అండ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా నిలిచింది. ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలానే ఉంది. తెలుగులో లోఫర్‌ సినిమా తో వరుణ్ తేజ్‌ తో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా ఆ తర్వాత హిందీలో ధోనీ తో అవకాశం దక్కించుకుని వెనక్కు తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో రచ్చ రచ్చ చేస్తోంది.

దిశా పటానీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు ఎప్పుడు కూడా ట్రెండ్డింగ్‌లోనే ఉంటున్నాయి. తాజాగా దిశా షేర్‌ చేసిన ఈ ఫొటో లు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. బికినీ బాడీ అన్నట్లుగా ఈ అమ్మడి లుక్‌ ను ఈ ఫొటోల్లో చూడవచ్చు. సాదారణంగా బికినీ వేసుకుంటే హీరోయిన్స్‌ చాలా హాట్ గా కనిపిస్తారు. కాని దిశా పటాని మాత్రం బికినీ లో లేకున్నా కూడా బికినీ వేసుకున్నట్లుగానే అందంగా ఉంటుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. దిశా మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలని కొందరు కోరుకుంటున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య ఇప్పట్లో ఆమె టాలీవుడ్‌ సినిమాలకు ఓకే చెప్పక పోవచ్చు అంటున్నారు.